సీఎం, సింగరేణి సీఎండీలకు హరీష్‌రావు లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సిగరేణి సీఎండీకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగూణంగా సింగరేణిలో పదోన్నతులు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సిగరేణి సీఎండీకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగూణంగా సింగరేణిలో పదోన్నతులు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయనీ.. వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
నల్గొండ : నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డు నకిరేకల్‌లోని భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రంలో రాత్రి నుంచి పడుతున్న అకాల వర్షానికి 6000 క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. దీనిలో 3000 క్వింటాళ్ల పత్తి రైతులు తీసువచ్చింది కాగా…
వరంగల్: భారీ వర్షం కారణంగా భూపాలపల్లి కాకతీయఖని ఓపెన్ కాన్ట్ ప్రాజెక్టులో శనివారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షం కురుస్తున్న కారణంగా యంత్రాలు, వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దాదాపు…
మనీలా : ఫిలిప్పీన్స్‌లోని మిదనావోలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.2గా నమోదైంది.
అనంతపురం : పరిగి సమీపంలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలిసింది.
న్యూఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో రెండో రోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల పొత్తులు తదితర అంశాలతో రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పి నేతలతో రాహుల్ చర్చిస్తున్నారు. ఈ…
వరంగల్ : అకాల వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట దెబ్బతింది. జనగాం, పరకాల, భూపాలపల్లిలో భారీ వర్షానికి కల్లాల్లో కంది, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రేగొండలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడిన్నాయి. రేగొండలో ఈదురుగాలులతో…
నిజామాబాద్: జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పిట్లం మండలం చిల్లర్లిలో గొర్రె నారాయణ, బిచ్కుంద మండలం మిషన్‌కల్లాలిలో రేణుక, గుండెకల్లూరులో భూంగోండా అనే వ్యక్తి మృతి చెందారు.
హైదరాబాద్: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.