Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పరిశీలించిన పార్లమెంటు అధికారుల బృందం

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ప్రతిష్ఠించే ఎన్టీఆర్‌ నమూనా విగ్రహాన్ని పార్లమెంటు అధికారుల బృందం పరిశీలించింది. దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌లో విగ్రహ రూపశిల్పి మాయాచారి ఇంటిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వారు పరిశీలించారు.

హైదరాబాద్

తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం : గండ్ర

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని భూపాలపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. యువత బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం కావాలన్నపుడు తమకు నిరాశ కలిగిందన్నారు.…

హైదరాబాద్

ముగిసిన టి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం

హైదరాబాద్‌: సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల  సమావేశం ముగిసింది. ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సోనియాకు లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

జిల్లా వార్తలు

సంగారెడ్డి కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మారుతీదేవి కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు శుక్రవారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,920, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,800గా ఉంది. కిలో వెండి ధర…

హైదరాబాద్

టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌: సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు., తెలంగాణ సాధన, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు.

హైదరాబాద్

దోషులను వెంటనే అరెస్టు చేయాలి : తలసాని శ్రీనివాసయాదవ్‌

హైదరాబాద్‌: ఆల్వాల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసంపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలి వద్ద పార్టీ నేతలు తలసాని శ్రీనివాసయాదవ్‌, మహేందర్‌రెడ్డి కార్యాకర్తలతో కలిసి నిరసనకు దిగారు. జవహర్‌నగర్‌, బాలాజీనగర్‌లో దుకాణాలను కార్యకర్తలు మూసివేయించారు. దోషులను గుర్తించి పోలీసులు…

జాతీయం

ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి

ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. కూలిన వంతెన  శిధిలాల కింద కూలీలు…

హైదరాబాద్

స.హ కమిషనరల నియామకంపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నలుగురి నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 11న విచారణ చేపట్టనుంది. సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం…

హైదరాబాద్

నల్లమలకు బయలుదేరిన స్పీకర్‌ బృందం

హైదరాబాద్‌: నల్లమల అటవీప్రాంతంలో చెంచుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ మహబూబ్‌నగర్‌ జిల్లాకు బయలుదేరింది. జిల్లాలోని మన్ననూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల అభివృద్ధి, తాగునీరు, గృహ నిర్మాణాలు,…