February 2013
కాంగ్రెస్, వైకాపా కార్యకర్తల మథ్య ఘర్షణ
నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
రామగుండం వద్ద గూడ్స్ రెళ్లో మంటలు
కరీంనగర్: బొగ్గు లోడ్‌తో వెళ్తోన్న గూడ్స్ రైళ్లో మంటలు చెలరేగాయి. బొగ్గు లోడ్‌తో వెళ్తోన్న గూడ్స్ రైలు రామంగుండం వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన గూడ్స్ రైలు డ్రైవర్ రైలును వెంటనే నిలిపివేశారు. అధికారులకు సమాచారం అందించారు.…
ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో
ఆదిలాబాద్: ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. లక్సెట్టిపేట మండలం మోదెలలో గుళ్లకోట వీఆర్వో రత్నయ ఓ వ్యక్తి నుంచి నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు…
నేడు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేర్‌రావు అధ్యక్షతన ఇవాళ జరిగే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు.…
లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 26 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
శాంతాక్రజ్ దీవుల్లో భారీ భూకంపం
శాంతాక్రజ్ : అమెరికాలోని శాంతాక్రజ్ దీవుల్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.9గా నమోదైంది. దీంతో దక్షిఫ పసిఫిక్ దీవుల్లో సునామీ హెచ్చరికలను పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది. హవాయి దీవులకు…
యాసిడ్ తాగి వ్యక్తి మృతి
రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం ఇమాంగూడ వద్ద కారులో ఓ వ్యక్తి యాసిడ్ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని అంబర్‌పేటకు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పూతలపట్టు : చిత్తూరు జిల్లాలోని కర్నూలు-పూతలపట్టు జాతీయరహదారిపై రంగంపేట వద్ద కారు, స్కార్పియో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. చిత్తూరు నుంచి పీలేరు వైపు వెళ్తున్న స్కార్పియోను ఎదురుగా వస్తున్న కారు…
తెరాస కార్యవర్గ భేటీ నేడు
హైదరాబాద్: తెరాస కార్యవర్గం నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణభవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. ఉద్యమ కార్యాచరణ, పల్లెబాటపై నేతలు సమీక్షించనున్నారు.

