Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

శంకర్రావుకు పీసీసీ చీఫ్‌ బొత్స పరామర్శ

హైదరాబాద్‌: మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రావును పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. శంకర్రావు చికిత్స పొందుతోన్న బంజారహిల్స్‌లోని ఆస్పత్రికి వెళ్లిన బోత్స శంక్రరావు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓ భూవివాదం కేసులో పోలీసులు…

కరీంనగర్

అప్పన్నపేట జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.

జాతీయం

ప్రధానితో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో గుజరాత్‌ సీఎం నేరేంద్రమోడీ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను ప్రధానిని కలిసినట్టు సమావేశం అనంతరం మోడీ తెలిపారు. గుజరాత్‌ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తాను ప్రధానిని కోరానని పేర్కొన్నారు. గుజరాత్‌లో పెండింగ్‌లో ఉన్న పలు…

అంతర్జాతీయం

సోలోమన్‌ దీవులను తాకిన సునామీ

హోనేరా : ఆస్ట్రేలియాకు సమీపంలోని సోలోమన్‌ దీవుల్లో సంభంవించిన భారీ భూకంపం సునామీకి దారి తీసింది. ఉవ్వెత్తున్న లేచిన భారీ అలలు దక్షిణ పసిఫిక్‌ దీవుల్లోని తీరప్రాంతాలను చేరి పలు నివాసాలను ధ్వంసం చేశాయి. అయితే సోలోమన్‌లోని పలు…

జాతీయం

విద్యార్థులు గుజరాత్‌ సీఎం పాఠాలు

న్యూఢిల్లీ : ఢీల్లీలోని ఒక కళాశాలలో విద్యార్థులకు అభివృద్థి పాఠాలు చెప్పడానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఢీల్లీ చేరుకున్నారు. ఉదయం ఆయన  ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవలి  ఎన్నికల్లో తన విజయానికి ప్రధాని అభినందనలు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 30,600 పలుకుతోంది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా

హైదరాబాద్‌: మహానగర పాలక సంస్థ ప్రత్యేక బడ్జెట్‌ సమావుశాన్ని మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ నిరవధికంగా వాయిదా వేశారు. దీనికి నిరసనగా మేయర్‌  ఛాంబర్‌ను తెదేపా కార్పొరేటర్లు ముట్టడించారు. మేయర్‌కు వ్యతిరేంగా నినాదాలు చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అంతర్జాతీయం

‘ఏరో ఇండియా -2013’ ప్రారంభం

బెంగళూరు: ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ‘ఏరో ఇండియా -2013’ కార్యక్రమం బెంగళూరులో ప్రారంభమైంది. నగర శివారులోని యలహంక వైమానికి స్థావరంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఏకే అంటోనీ ప్రారంభించారు. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన యుద్ధ…

జాతీయం

అత్యాచారయత్నం చేసి యువతిపై ఇనుప రాడుతో దాడి

న్యూఢిల్లీ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశరాజధానిలో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారాని యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గొంతులో ఇనుప రాడును దించి పారిపోయాడు. నిన్న సాయంత్రం…

వార్తలు

ఆస్ట్రేలియాలో భారీ భూకంపం

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సోలోమన్‌ దీవుల్లో భారీ  భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8.0గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపాపికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.