Monday, 2 November 2026

March 2013

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి

తెలుగుదేశం మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని వారు ఆరోపించారు.

ఆదిలాబాద్

ప్ర’జల’ కష్టాలు

చేతిపంపుల వద్ద బారులు మోటార్ల మరమ్మతుపై నిర్లక్ష్యం జన్నారం, న్యూస్‌లైన్‌: వేసవి ఆరంభంలోనే ప్ర’జల’ కష్టాలు మొదలయ్యాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు .చేసిన మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారండంతో పరిస్థితి దాహార్తి తీర్చేందుకు ఆయా…

సీమాంధ్ర

పేదలపై భారం పడకుండా చూస్తాం : సీఎం

చిత్తూరు : పేదవారితో విద్యుత్‌ చార్జీల భారం పడకుండా చూస్తామని సీఎం కిరణ్‌ హామీయిచ్చారు. పెంచిన కరెంట్‌ చార్జీలపై చర్చించేందుకు 4,5 తేదీల్లో హైదరాబాద్‌ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై ఈ ఆర్సీ ప్రతిపాదనలను…

ఆదిలాబాద్

యువజనసంఘం గోకొండలో క్రికెట్‌ పోటీలు

గోకొండలో న్యూస్టార్‌ యువజనసంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలను ఎస్పై రవీందర్‌ ప్రారంభించారు. గ్రామీణప్రాంతాల్లో క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సాహించాలని ఆయన కోరారు. ఈ పోటీల్లో 30 క్రికెట్‌ జట్లు పాల్గొంటున్నాయి.

సీమాంధ్ర

పేకాడుతున్న ఏడుగురు టీచర్ల అరెస్ట్‌

ఎర్రగుండ్ల : వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుండ్ల మండలం చిలమకూరులో పేకాడుతున్న ఏడుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 14 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

అత్యధికంగా కడపలో 41 డిగ్రీలు నమోదు హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా…

ఆదిలాబాద్

ఘనంగా ఈస్టర్‌ పండుగ

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని చర్చిల్లో ఆదివారం ఈస్టర్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్‌ పండుగ ప్రాధాన్యతను ఆయా చర్చిల ఫాదర్‌లు వివరించారు.

జిల్లా వార్తలు

ప్రమాదవశాత్తూ ఉసిరితోట దగ్ధం

షాబాద్‌: మండలంలోని చెర్లగూడలో ప్రమాదవశాత్తూ కమాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల ఉసిరితోట దగ్దమైంది. పక్కపొలంలోని రైతు పత్తి కట్టెను తగలబెట్టడంతో ఆ మంటలు తోటలోనికి వ్యాపించడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.

అంతర్జాతీయం

రేప్‌ కేసులో నిందితుడికి ఏడేళ్ల శిక్ష

డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌) : మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కాషియాపూర్‌ స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొరదాబాద్‌ కు చెందిన మనీష్‌ షైని గతేడాది అక్టోబర్‌ లో పాఠశాల నుంచి మైనర్‌ బాలికను అపహరించి…

జిల్లా వార్తలు

గాంధీ విగ్రహం చేయి విరగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

శామీర్‌పేట్‌: పొన్నాలలో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహం చేయి విరగగొట్టారు. దీనిపై గ్రామస్థులు ఆందోళన చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.