చిత్తూరు : పేదవారితో విద్యుత్ చార్జీల భారం పడకుండా చూస్తామని సీఎం కిరణ్ హామీయిచ్చారు. పెంచిన కరెంట్ చార్జీలపై చర్చించేందుకు 4,5 తేదీల్లో హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఈ ఆర్సీ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్ లో రూ. 5700 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మీడియాలో చూపించినంతగా లేదన్నారు.




