Thursday, 5 November 2026

March 2013

కరీంనగర్

పశువైద్య శిబిరానికి స్పందన

ఎల్లారెడ్డిపేట: మార్కెట్‌ ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యాన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడు ఆంజనేయరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు.

జాతీయం

సంజయ్‌ దత్‌కు అయిదేళ్ల జైలు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు సుప్రీంకోర్టు గురువారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగిన కేసులో ఆయనకు న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇప్పటికి 16 నెలల జైలుశిక్ష అనుభవించిన సంజయ్‌…

జాతీయం

యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాకూబ్‌, అబ్దుల్‌ రజాక్‌ మెమన్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో మరో పదిమంది నిందితులకు…

హైదరాబాద్

బాంబు పేలుళ్ల మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వెంకటేశ్‌ భార్య సుజాతకు పశుసంవర్థక శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అరెస్టు

మహబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను గురువారం జిల్లా పోలీసులు మహ్మదాబాద్‌ వద్ద అరెస్టు చేశారు.అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

జిల్లా వార్తలు

గీత కార్మికుడికి గాయాలు

డోర్నకల్‌: మండలంలోని చిల్కోడు గ్రామంలో గురువారం చెట్టుపై నుంచి పడి రాఘం సుధాకర్‌ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సుధాకర్‌ వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని 108లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

బస్సు, ఆటో ఢీ : ఐదుగురికి తీవ్రగాయాలు

మెదక్‌ : తుప్రాన్‌ మండలం దండుపల్లిలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

జిల్లా వార్తలు

షాబాద్‌ పీఎస్‌కు కేటీఆర్‌ తరలింపు

షాబాద్‌: సడక్‌బంద్‌లో  భాగంగా కేటీఆర్‌, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌తో పాటు 30 మందిని షాద్‌నగర్‌లో అరెస్టు చేసి అరెస్టు రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.

హైదరాబాద్

నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఒఎంసి) కేసులో నిందితురాలుగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఆమెకు న్యాయస్థానం ఈనెల 25 వరకూ రిమాండ్‌ విధించింది. అనంతరం శ్రీలక్ష్మిని చంచల్‌గూడ జైలుకు…

జిల్లా వార్తలు

సడక్‌ బంద్‌ నేపథ్యంలో పలువురి అరెస్టు

సంగారెడ్డి అర్బన్‌: సడక్‌బంద్‌ నేపథ్యంలో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.