Thursday, 5 November 2026

March 2013

కరీంనగర్

మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జగిత్యాల: సారంగపూర్‌ మండలం సర్పపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఈ నెల 20వతేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహంచనున్నారు.

జాతీయం

ఇద్దరు ఉగ్రవాదులకు ఎన్‌ఐఏ కస్టడీ

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇద్దరు ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను 4 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది.…

జిల్లా వార్తలు

రెవెన్యు సదస్సులు అడ్డుకున్న గ్రామస్థులు

మందకల్‌: మండలంలోని విజ్వారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వుతుండటంపై గ్రామస్థులు తహశీల్దారు సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించక పోవటంతో గ్రామస్థులు సదస్సును అడుకున్నారు. దీంతో తహశీల్దారు గుట్టల వద్దకు…

హైదరాబాద్

కంతనపల్లికి ఈ నెల 20న టెండర్లు

హైదరాబాద్‌ : కంతనపల్లి ప్రాజెక్టుకు ఈ నెల 20న టెండర్లు పిలవనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శ్రీరాంసార్‌ ప్రాజెక్టు రెండో ఫేజ్‌ వల్ల వరంగల్‌ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు.బాబ్లీ ప్రాజెక్టుపై త్వరలోనే…

అంతర్జాతీయం

408 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

మొహాలీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిని ఆసీన్‌ మరో 135 పరుగులను…

హైదరాబాద్

శాసన సభ మరోసారి వాయిదా

హైదరాబాద్‌ : విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య శాసనసభ రెండోసారి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రరంభం కాగానే తెదేపా, తెరాస సభ్యులు తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగించారు. బాబ్లీపై చర్చకు…

జిల్లా వార్తలు

మాసబ్‌ చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం

తుర్కయాంజాల్‌: నాగార్జునసాగర్‌ రహదారి తర్కయాంజల్‌ మాసబ్‌ చెరువు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ఇతనిని హత్యచేసి ఇక్కడ పడేసి నట్లుగా వనస్థలిపురం పోలీసులు అనుమానిస్తున్నారు.

జిల్లా వార్తలు

ట్రాక్టరు కింద పడి రైతు మృతి

నిజామాబాద్‌ గ్రామీణం: మండలంలోని కులాన్‌పూర్‌కు చెందిన స్థానిక రైతు గంగారెడ్డి ట్రాక్టరు కింద పడి మృతి చెందాడు. ట్రాక్టరులో ఉల్లి గడ్డలు నింపుకుని తరలించే ప్రయత్నంతో అదే ట్రాక్టరు కింద జారి పడి చనిపోయాడు.

జిల్లా వార్తలు

పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు గాయాలు

జిన్నారం: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అరబిందో యూనిట్‌-8లో ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాలు మీదపడి మంటలు అంటుకుని ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ కార్మికులు బుడ్డేశ్వర్‌, భానుప్రసాద్‌లను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు…

కరీంనగర్

విద్యుత్‌ ఉపకేంద్రంపై దాడి

విద్యుత్‌ కోతలకు నిరసనగా మల్లాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంపై రైతులు దాడికి దిగారు. అప్రకటితో కోతలను ఎత్తివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.