Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

ఇంట్లోకి దూసుకుపోయిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

వరంగల్‌: హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయం

రూ. 417 కోట్ల నీలం తుపాను పరిహార నిధులు విడుదల

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నీలం తుపాను పరిహారం కింద కేంద్రం రూ.417 కోట్లను విడుదల చేసింది. తుపాను నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రకు కరువు నిధుల కింద…

వార్తలు

సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి.. ఐదుగురు జవాన్ల మృతి

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనిగర్‌ జెమినాలోని ఓ పాఠశాలకు సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బేఫ్‌ క్యాంపుపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో…

వార్తలు

వాయుసేవ ఉద్యోగి సముద్రంలో గల్లంతు

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక పొగురు వద్ద మరపడవలో వెళుతున్న వాయుసేవ సిబ్బందిలో ఒకరు సముద్రంలో గల్లంతయ్యారు. వాయు సేవలో పనిచేస్తున్న నలుగురు సిబ్బంది సముద్రంలో మర పడవలో వెళ్తుండగా అలల ఉధ్ధృతికి పడవ…

జిల్లా వార్తలు

ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌ కాపీయింగ్‌

నల్గొండ: ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో ఈటీవీ కెమెరాలను చూడగానే…

హైదరాబాద్

దఫా బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌ : ఈ నెల 26 వరకు మొదటి దఫా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…

హైదరాబాద్

ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: గడ్డిఅన్నారంలోని రెడ్‌క్రాస్‌ ప్రసూతి ఆసుపత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆసుపత్రిలోని రికార్డు గది పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు.

హైదరాబాద్

బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స వికటించి వ్యక్తి మృతి

హైదరాబాద్‌ : బరువు తగ్గేందుకు చేసిన శస్త్రచికిత్స వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌ రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్‌ అధిక బరువు సమస్యతో ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చేరారు. బరువు తగ్గేందుకు వైద్యులు…

జిల్లా వార్తలు

ఇంట్లోకి దూసుకుపోయిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

వరంగల్‌ : హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వార్తలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

ఎస్‌.రాయవరం : విశాఖపట్నం జిల్లా ఎస్‌. రాయవరం మండలం అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున ఎలమంచిలి నుంచి తుని వైపు ఇద్దరు. యువకులు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. వెనక…