Friday, 6 November 2026

April 2013

హైదరాబాద్

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగర మార్కెట్‌లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,060,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…

సీమాంధ్ర

ఆహారంలో విషం కలిపి హత్య : వరవరరావు

భద్రాచలం, జనంసాక్షి: ఛత్తీస్‌గడ్‌లో నిన్న జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఇక్కడ ఆస్పత్రిలోని మృతదేహాలను ఆయన సందర్శించారు. బంధువులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవర్టు ఆపరేషన్‌ ద్వారా ఆహారంలో…

వార్తలు

శ్రీకూర్మం ఆలయంలో మహా సంప్రోక్షణ

రామలక్ష్మణ కూడలి(శ్రీకాకుళం) : శ్రీకూర్మం క్షేత్రంలో ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు మహాసంప్రోక్షణ పూజలు నిర్వహించారు. మూలవిరాట్‌ను రహస్యంగా అచ్చు తీశారనే ఆరోపణలతో చెలరేగిన వివాదంపై గ్రామస్థుల ఆందోళనతో గ్రామానికి అరిష్ఠం కలగకుండా ఉండేందుకు ఈ పూజలు నిర్వహించినట్లు…

అంతర్జాతీయం

భూకంప మృతులకు సంతాపం తెలిపిన మంత్రి జాన్‌కెర్రీ

వాషింగ్టన్‌, జనంసాక్షి: ఇరాన్‌, పాకిస్థాన్‌ భూకంపానికి మృతి చెందిన కుటుంబాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ సంతాపం ప్రకటించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్‌, పాకిస్థాన్‌ దేశాలకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.…

హైదరాబాద్

తెలంగాణ తెదేపా నేతల సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ తెదేపా నేతలు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు భేటీ అయి తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

సీమాంధ్ర

‘మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలి’

భద్రాచలం, జనంసాక్షి: నిన్న పోలీస్‌ దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని వారి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. వారిని పోలీసులు ఏదైన చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 47 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

భాజపా కార్యాలయం వద్ద కారులో పేలుడు

బెంగళూరు : భాజపా కార్యాలయం వద్ద ఈ ఉదయం నిలిపి ఉంచిన కారులో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిని వెంటనే పోలీసులు అధీనంలోకి తీసుకొని సహాయక…

తెలంగాణ

తేనేటీగల దాడిలో గాయపడిన ఉపాధి హమీ కూలీలు

వరంగల్‌, జనంసాక్షి: ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం యాపలగడ్డలో చోటు చేసుకుంది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సీమాంధ్ర

ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

అనంతపురం, జనంసాక్షి: లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. తనకల్లు ఉద్దేహళ్ల పాఠశాలలలో పనిచేస్తున్న ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు డిఐఓ శ్యామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.