Friday, 6 November 2026

April 2013

కరీంనగర్

టీఆర్‌ఎస్‌లో చెరతా :టీడీపీ ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌ : తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చెప్పారు. టీడీపీలో తెలంగాణపై మాట్లాడే స్వేచ్చ లేదన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు జై తెలంగాణ అంటే ,సీమాంద్ర టీడీపీ నేతలు జై సమైక్యాంద్ర అంటున్నారని…

సీమాంధ్ర

కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి దిగిన దొంగ

ఒంగోలు, జనంసాక్షి: కానిస్టేబుల్‌పై ఓ దొంగ కత్తితో దాడి చేసి పరారైన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైలేస్టేషన్‌లో చోటుచేసుకుంది. సర్కార్‌ ఎక్స్‌ప్రెన్‌ ఎన్‌-8బోగీలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ చోరీకి గురైంది.వెంటనే అక్కడ ఉన్న రేల్వే కానిస్టేబుల్‌ దొంగను…

తెలంగాణ

కరవుపై కేంద్ర బృందం సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరవు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరవు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో బృందం సమీక్షించింది.

తెలంగాణ

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి…

తెలంగాణ

రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం…

సీమాంధ్ర

యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కార్మాలయంలో దస్ట్రాలు దగ్ధం

కర్నూలు, జనంసాక్షి: రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్త్రాలు కాలిబూ డిదైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోజువారి నిర్వహణతో పాటు ముఖ్యమైన దస్త్రాలు అనుమానాస్పద స్థితిలో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై విశ్వవిద్యాలయం అధికారులు విచారణచేపట్టారు.

సీమాంధ్ర

విశాఖ బస్టాండ్‌ వద్ద అగ్ని ప్రమాదం

విశాఖ, జనంసాక్షి నగరంలోని ద్వారకానగర్‌ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఈ సముదాయంలో…

అంతర్జాతీయం

లోయలో పడిన కారు: 12మంది మృతి

షిమ్లా, జనంసాక్షి: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లా తల్హాని ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.

అంతర్జాతీయం

బాగ్ధాద్‌లో బాంబుల మోత: 27 మంది మృతి

బాగ్ధాద్‌, జనంసాక్షి: ఇరాక్‌ రాజధాని బాగ్ధాద్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. ముష్కరమూకలు తెల్లవారుజామునే రహదారులపై రక్తం పారించారు. వరుసగా జరిగిన కారు బాంబుల పేలుళ్లలో 27 మంది మృతి చెందారు. సుమారు వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను…

తెలంగాణ

జగన్‌కు రిమాండ్‌ పొడిగించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తులు ,ఓఎంసీ, ఎమ్మార్‌ కేసు నిందితులను నాంపల్లి సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. జగన్‌, శ్రీనివాస్‌రెడ్డి, మోపినేని వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్‌ పొడగించింది.…