Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

పులి దాడి నుండి ఓవ్యక్తి తప్పించుకున్నాడు

శంషాబాద్‌: మండలంలోని తొండుపల్లి శివారులో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్థానిక సీఎన్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మూడు పిల్లలతో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ వ్యక్తిపై పులి దాడికి యత్నించగా అతను తప్పించుకున్నాడు. స్థానిక…

వార్తలు

బూడిదగుంట నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన తెదేపా

ముత్తుకూరు: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరులో జెన్‌కో నిర్మిస్తున్న బూడిదగుంటకు వ్యతిరేకంగా తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్లాంటు వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబాయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

తెలంగాణ

మంత్రి రాంరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే ఫిర్యాదు

హైదరాబాద్‌: మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే చంద్రావతి ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీమాంధ్ర

నేడు వైభవంగా జరగనున్న సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవం

సింహాచలం, విశాఖ: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న బ్రహ్మోత్సవాలు సింహాచలంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి రథోత్సవం , కల్యాణోత్సవాన్ని సింహాగిరిపై నిర్వహించనున్నారు. నృసింహ మండపంలో ఏడు వేల మంది భక్తులు స్వామి వివాహ…

తెలంగాణ

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌కు వినతి అందించారు

వరంగల్‌: జిల్లాలో వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు ఈ ఉదయం వినతిపత్రం అందించారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ

దుండగులు చేత యాసిడ్‌కు గురైన ఓమహిళ

రంగారెడ్డి: పెద్దేముల్‌ మండలం జనగాంలో ఓ మహిళపై దుండగులు యాసిడ్‌ దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

సీమాంధ్ర

రైతు చైతన్యయాత్రను ఉదయంమే ప్రారంభించిన మంత్రి

అనంతపురం: రైతు చైతన్యయాత్రను హిందూపురంలో మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Featured News

పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తాం

టీ కాంగ్రెస్‌ ఎంపీలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్‌లో ఆఖరిపోరాటం కొనసాగిస్తామని టీ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ డాక్టర్‌ గడ్డం వివేకానంద నివాసంలో ఎంపీలు మందా…

Featured News

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే

ప్రధానికి లేఖ రాస్తా ఆంధ్రజ్యోతి పిచ్చిరాతలు మానుకో… : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రమణాచారి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ ప్రజల హక్కే, ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి…