సింహాచలం, విశాఖ: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న బ్రహ్మోత్సవాలు సింహాచలంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి రథోత్సవం , కల్యాణోత్సవాన్ని సింహాగిరిపై నిర్వహించనున్నారు. నృసింహ మండపంలో ఏడు వేల మంది భక్తులు స్వామి వివాహ మహోత్సవాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఈసారి తలంబ్రాలతోపాటు ఒక ముత్యాన్ని అందించనున్నట్లు ఈవో కె, రామచంద్రమోహన్ తెలిపారు.




