Thursday, 5 November 2026

April 2013

వరంగల్

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తా : బలరాం నాయక్‌

వరంగల్‌ : ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ తెలిపారు. ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ప్రధాననినైనా ఒప్పించి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.

ఆదిలాబాద్

ఏసీబీ వలలో సిర్పూర్‌ (టి) ఎంఈవో

సిర్పూర్‌ : అవినీతి నిరోధక శాఖా (ఏసీబీ ) వలలో మరో లంచావతారం చిక్కింది. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి) ఎంఈవో మరియాదాస్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి అధికారులకు చిక్కాడు.

వరంగల్

అభివృద్ది కోసం తెలంగాణకు మద్దతిస్తాం : వెంకయ్యనాయుడు

వరంగల్‌ : అభివృద్ది కోసం తెలంగాణకు మద్దతిస్తామని భాజపా సీనియర్‌ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌ లో నిర్వహించిన భాజపా జనచైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉండడం నష్టం లేదన్నారు.…

హైదరాబాద్

ట్యాంక్‌బండ్‌ పై కొవ్వొత్తుల ర్యాలీ

హైదరాబాద్‌ : దేశ రాజధానిలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన కామాంధున్ని శిక్షించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

సీమాంధ్ర

రాజమండ్రిలో భారీ వర్షం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజమండ్రి ,అమలాపురం ,కాకినాడ ,జగ్గంపేట ప్రాంతాల్లో వర్షం పడింది. మామిడి, జీడిమామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

స్పొర్ట్స్

28 మంది యువతుల పరారీ

హైదరాబాద్‌ : రామాంతపూర్‌ ఉజ్వల పీస్‌ పునరావాస కేంద్రం నుంచి 28 మంది యువతులు పరారయ్యారు. ముగ్గిరిని అదుపులోకి తీసుకుని నిర్వాహకులకు పోలీసులు అప్పగించారు. మిగిలిన 25 మంది యువతుల కోసం గాలింపు చేపట్టారు.

సీమాంధ్ర

గనుల కేటాయింపుపై రాద్దాంతం :సీఎం

విశాఖపట్నం : విశాఖ స్టీల్స్‌కు బయ్యారం గనులు కేటాయించటంపై రాధ్దాంతం చేస్తున్నారని సీఎం కిరణ్‌ అన్నారు.తాము ఓ ప్రాంతం కోసం పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆంధ్రావాసులకుగానీ ప్రభుత్వానికిగాని ఒక్క షేర్‌ కూడా లేదన్నారు. విశాఖపట్నంలో…

హైదరాబాద్

ఈ నెల 22 నుంచి రైతు చైతన్య యాత్రల నిర్వహణ : మంత్రి కన్నా

హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 22 నుంచి మే 8 వరకు రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. మే 9 నుంచి 13 వరకు అన్ని డివిజన్లలో రైతు సదస్సులు నిర్వహిస్తామన్నారు. వడ్డీ…

స్పొర్ట్స్

నాలుగో వికెట్‌ కోల్పోయిన చైన్నై

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. మొదటి వికెట్‌ అశ్విన్‌ రూపంలో కోల్పోగా ,రెండో వికెట్‌ మురళి విజయ్‌ 2 , రైనా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ఔటయ్యారు.జట్టు క్యాప్టెన్‌ ధోని…

జాతీయం

సోనియా ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకుతుంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ ఇంటిని ముట్టడించేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే…