Tuesday, 3 November 2026

May 2013

సీమాంధ్ర

కార్యకర్తలతో దాడి సమావేశం

విశాఖ : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే తెదేపాలోనే ఉండాలంటూ దాడికి పలువురు కార్యకర్తలు సూచించారు. శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న దాడి పదవీకాలం నిన్న ముగిసిన కొద్దిగంటల్లోనే పార్టీకి…

జాతీయం

ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ

ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది.

తెలంగాణ

సిలిండర్‌ పేలి ఒకరి మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓ వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక…

సీమాంధ్ర

ఐదేళ్ల కూతురిని గొంతునులిమి చంపిన తల్లి

గుంటూరు : నరసరావుపేటలోని బాబాపేటలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంతో ఓ మహిళ తన ఐదేళ్ల కూతురిని గొంతునులిమి చంపింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన మహిళను అరెస్టు చేశారు.

సీమాంధ్ర

బంగారుతల్లిపై విమర్శలు అర్థరహితం : మంత్రి పితాని

ఏలూరు : బంగారుతల్లి పథకంపై వస్తున్న విమర్శలు అర్థరహితమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్నవారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు.

తెలంగాణ

గరిష్ఠ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. రామగుండంలో 43.6, హైదరాబాద్‌లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల, జనంసాక్షి:  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు 6 గంటల సమయం…