Tuesday, 3 November 2026

May 2013

అంతర్జాతీయం

జమ్మూలో పాక్‌ ఖైదీపై దాడి

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కోట్‌బల్వాల్‌ జైలులో పాకిస్థాన్‌కు చెందిన ఖైదీపై దాడి జరిగింది. పాక్‌ ఖైదీపై భారత ఖైదీలు దాడికి దిగడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జైలు అధికారులు ఖైదీని ఆసుపత్రికి తరలించారు.

అంతర్జాతీయం

పాక్‌లో సీనియర్‌ న్యాయవాది కాల్చివేత

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో 26/11 ముంబయి దాడుల కేసు, బెనజీర్‌ భుట్టో హత్య కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాదిని దుండగులు ఇస్లామాబాద్‌లో ఈ ఉదయం కాల్చిచంపారు. కారులో వస్తున్న న్యాయవాది జుల్ఫీజర్‌ అలీపై ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు…

జాతీయం

మాజీ మంత్రి అంబుమణి రాందాన్‌ అరెస్టు

చెన్నై : కేంద్ర మాజీ మంత్రి అంబుమణి రాందాస్‌ను ఈ ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో కాంచీపురం పోలీసులు అరెస్టు చేశారు. 2012లో రెచ్చగొట్టేలా ప్రసంగించారని దాఖలైన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ

తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ అరెస్టు

సిద్ధిపేట : బయ్యారం గనులపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌లో భాగంగా సిద్ధిపేట బస్‌డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

తెలంగాణ

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

మేడ్చల్‌ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలంలోని మునిరాబాద్‌ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

తెలంగాణ

మెదక్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

మెదక్‌ : బయ్యారం గనుల కేటాయింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస ఇచ్చిన పిలుపు మేరకు మెదక్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున సంగారెడ్డిలో రెండు బస్సులను దుండగులు దహనం చేశారు. మెదక్‌, సిద్ధిపేట,…

సీమాంధ్ర

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

అనంతపురం : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

గృహనిర్మాణ సంస్థ డీఈ ఇంటిలో ఏసీబీ సోదాలు

గుంటూరు : వినుకొండ గృహనిర్మాణ సంస్థ డీఈ శంకర్‌రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అరోపణలపై గుంటూరులోని శంకర్‌రావు నివాసం సహా 6 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు.…

జాతీయం

నేడు సరబ్‌జిత్‌సింగ్‌ అంత్యక్రియలు

అమృత్‌సర్‌ : పాకిస్థాన్‌లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత చెందిన సరబ్‌జిత్‌ అంత్యక్రియలు నేడు పంజాబ్‌లోని స్వగ్రామం బిఖివింద్‌లో అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు హాజరుకానున్నారు. సరబ్‌జిత్‌…

తెలంగాణ

బయ్యారంలో కర్మాగారం ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి

-తెరాస నేత హరీశ్‌రావు మెదక్‌ : బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. బయ్యారం గనులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా బంద్‌ నేపధ్యంలో ఆయన…