Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

బలరాం నాయక్‌, రాజయ్యలకు వారెంట్లు!

వరంగల్‌, జనంసాక్షి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్‌ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం !

భూపాలపల్లి, జనంసాక్షి: మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి సంఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటు చేసుకుంది. కామాంధుడ్ని గ్రామస్థులు పట్టుకుని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు…

సీమాంధ్ర

జగన్‌ విడుదల కోసం ప్రత్యేక పూజలు !

ఆలూమూరు, జనంసాక్షి: జగన్‌ ,జైలు నుంచి విడుదల కావాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలుమూరు మండలం జొన్నాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్‌ విడుదల కోసం జగ్గిరెడ్డి చేపట్టిన యాత్రకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు సాయిబాబా గుడిలో…

తెలంగాణ

టీ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ

అమ్మ హస్తం పై కావాలనే దుష్ప్రచారం : మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకంపై కావాలనే కొందరు క దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. అమ్మహస్తం కార్యక్రమంలోని లోపాలను సవరిస్తామని తెలిపారు. అమ్మహస్తం కోసం జిల్లాకొక అధికారిని ఇవ్వాలని సీఎస్‌ను కోరామని…

తెలంగాణ

భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

హైదరాబాద్‌, జనంసాక్షి: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 329 పాయింట్ల నష్టంతో 19733 పాయింట్ల వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల పతనంతో 5982 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ సూచీ…

సీమాంధ్ర

టీటీడీ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టిన లెక్చరర్లు

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని తప్పుబడుతూ కాంట్రాక్టు లెక్చరర్లు ధర్నాకు దిగారు. టీటీడీ నిర్వహిస్తున్న డెమో పరీక్షలు వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. డెమో పరీక్షను నిర్వహించడానికి టీటీడీ సిద్ధమవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు.

అంతర్జాతీయం

క్వెట్టాలో బాంబు పేలుడు:12మంది మృతి

పాకిస్థాన్‌ , జనంసాక్షి: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

సాయంత్రం భేటీకానున్న కేంద్ర సబ్‌ కేబినెట్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంతి వర్గ ఉపసంఘం నార్త్‌బ్లాక్‌లో భేటీ కానుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, కపిల్‌ సిబల్‌,…

ఆదిలాబాద్

అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు సజీవదహనమయ్యాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు…