Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి జనాలు తల్లడిల్లుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 46, నిజామాబాద్‌లో 45,5 హైదారాబాద్‌, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణ

దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ అయ్యాడు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పదింటికి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరడు ఆరోపించినట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాల సభ్యులు తీవ్ర…

తెలంగాణ

బోయిన్‌పల్లిలో వాహనదారుల ధర్నా

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో పార్కింగ్‌ వసూళ్లను నిరసిస్తూ వాహనదారులు ధర్నాకు దిగారుదీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కూరగాయాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.

తెలంగాణ

మాజీ సర్పంచ్‌ దారుణహత్య

పెబ్బేరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ మాజీ సర్పంచ్‌ రవీందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

రౖలు ఢీకొని ఇద్దరి మృతి

ఆముదాలవలస, జంనసాక్షి: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు . పట్టాలు దాటుతున్న సమయంలో రైలు రావడాన్ని వారు గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

సీమాంధ్ర

తాళం వేసి ఉన్న ఇల్లు లూటీ

కొత్తపేట , జనంసాక్షి: తూర్పుగోదావరి కొత్త మండలం కమ్మిరెడ్డిపాలెం సమీపంలో గల గౌతమీ పాఠశాల పక్కన ఎరువుల వ్యాపారి ఖాలందరి షరీఫ్‌ నివాసముంటున్నాడు ఆయన కుంటుబసభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లివచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లో బీరువాలోని…

తెలంగాణ

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన

ఆదిలాబాద్‌, జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జావద్‌, డాక్టర్‌ ఇబాటేలను తొలగించాలని వారు. డిమాండ్‌ చేస్తున్నారు.

సీమాంధ్ర

చౌకబియ్యం పట్టివేత

రేపల్లె, జనంసాక్షి: గుంటూరు జిల్లా రేపల్లెలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల చౌకబియ్యాన్ని ఈ రోజు ఉదయం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్‌ చేశారు.

తెలంగాణ

పది గంటలకే మండుతున్న భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం అంతకంతకూ పెరుగుతోంది. వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, నిజామాబాద్‌ 45. 5, హైదరాబాద్‌, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో…

అంతర్జాతీయం

శ్రీనగర్‌లో లష్కరే తోయిబా తీవ్రవాది కాల్చివేత

శ్రీనగర్‌, జనంసాక్షి: జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌ లష్కరే తోయిబాకు చెందిన ఓ తీవ్రవాదిని పోలీసులు కాల్చిచంపారు. ఈ సంఘటన శ్రీనగర్‌లోని నార్పరిస్తాన్‌ ప్రాంతంలో జరిగిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ…