Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

సభా ప్రాంగణానికి చేరుకుంటున్న నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ హడావిడి కొనసాగుతుంది. నిజాం కళాశాలకు భారీగా తెలంగాణవాదులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి జానారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, మధుయాష్కీ, గుత్తా సఖేందర్‌రెడ్డి, సీనియర్‌…

జాతీయం

బద్రీనాత్‌ నుంచి రాష్ట్ర యాత్రికుల తరలింపు

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): బద్రీనాత్‌లో చిక్కుకున్న  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యాత్రికులను సహాయ సిబ్బంది ఈ రోజు హెలికాప్టర్లలో జోషిమఠ్‌, గౌచర్‌లకు తరలించినట్లు సమాచారం.

ఖమ్మం

భద్రాచలంలో సీతారాముల కల్యాణం

భద్రాచలం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల నిత్య కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. రామయ్య సన్నిధిలోని బేడా మండపంలో శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించిన 65 నిత్యకల్యాణాలలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. సీతమ్మ వారిని…

జాతీయం

70 మంది రాష్ట్ర యాత్రికులు తరలింపు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): బద్రీనాథ్‌ నుంచి 70 మంది రాష్ట్ర యాత్రికులను హెలికాప్టర్లలో జోషిమఠ్‌, గౌచర్‌లకు సహాయక సిబ్బంది తరలించారు. సహాయక చర్యలను ఐఏఎస్‌ అధికారి  సంజయ్‌కుమార్‌, ఐపీఎస్‌ అధికారి తరుణక్షజోషి పర్యవేక్షిస్తున్నారు.

సీమాంధ్ర

పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

అనంతపురం,(జనంసాక్షి): ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఓ తల్లి ఆత్మహత్యాయత్పానికి పాల్పడిరది. ఈ విషాదఘటన జిల్లాలోని ధర్మవరంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల కొడుకు మృతి చెందారు. తల్లి, మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వారిని…

సీమాంధ్ర

తెలంగాణను అడ్డుకుంటున్నది స్వార్థపరులే: సర్వేపల్లిసత్యనారాయణ

విశాఖ,(జనంసాక్షి): తెలంగాణ అడ్డుకుంటున్నది కొందరు స్వార్థపరులేనని కేంద్ర మంత్రి సర్వేపల్లిసత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రోళ్లకు హైదరాబాద్‌లో రక్షణ కల్పిస్తామని  సర్వే హామీ ఇచ్చారు. జాగో భాగో కాంగ్రెస్‌…

తెలంగాణ

గ్రామస్తుల రాస్తారోకో: పోలీసుల లాఠీచార్జ్‌

మెదక్‌,(జనంసాక్షి): చేగుంటను నగర పంచాయితీగా మార్చొద్దంటూ వడియారం హైవేపై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోకు దిగిన గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

తెలంగాణ

పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలి: గుత్తా సఖేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గతంలో ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే కాంగ్రెస్‌  బలం పెరుగుతుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీలు అంగీకరించేది లేదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిక…

తెలంగాణ

గవర్నర్‌ దంపతులను పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల విమలానరసింహన్‌ మాతృమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే.

సీమాంధ్ర

2014 లో బీజేపీదే అధికారం: వెంకయ్యనాయుడు

కర్నూలు,(జనంసాక్షి): కుంభకోణాల మయమైన  యూపీఏను వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలింపించరు అని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2014 లో కేంద్రంలో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం  చేశారు. చాలా పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి.…