వరద బాధితులకు కేంద్ర మంత్రి విరాళం
శ్రీకాకుళం: ఉత్తరాఖండ్ వరద బాధితులకు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఒక నెల వేతనం విరాళంగా ఇచ్చారు. ఎంపీ నిధుల నుంచి రూ. 10లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
శ్రీకాకుళం: ఉత్తరాఖండ్ వరద బాధితులకు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఒక నెల వేతనం విరాళంగా ఇచ్చారు. ఎంపీ నిధుల నుంచి రూ. 10లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
విజయవాడ,(జనంసాక్షి): విజయవాడ థర్మల్ విద్యుత్ ప్లాంటు(వీటీపీఎస్) నాలుగో యూనిట్‌లో శనివారం సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో అధికారులు మరమ్మతులకు ఆదేశించారు. విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందం చర్యలు…
ఢిల్లీ : ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను కాపాడేందుకు రాజస్థాన్ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు, 30 బస్సులను కేటాయించింది. సహాయక చర్యల కోసం గుజరాత్ ప్రభుత్వం కూడా రెండు హెలికాప్టర్లను కేటాయించింది. పుణెకు చెందిన 30 మంది యాత్రికులను…
గుంటూరు,(జనంసాక్షి): బాపట్ల సమీపంలో సూర్యలంకలోని సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్‌ను కేంద్రమంత్రి పనబాక లక్ష్మి శనివారం ప్రారంభించారు. అనంతరం ముక్తాయపాలెంలోని వంతెన వద్ద పడవల పోటీలను ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ వేడుకలు రేపటితో ముగియనున్నాయి.
హైదరాబాద్,(జనంసాక్షి): బంజారాహిల్స్‌లో రిలయన్స్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా చేసింది. కేబీబేసిన్‌లో అక్రమ వ్యాపారాలు చేస్తున్న రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఉత్తరప్రదేశ్: బస్తీ జిల్లా సాంసరిపూర్ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని చందంపేట మండలం ఎనమలమందలో దారుణ సంఘటన జరిగింది. 10 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కార్పోరేటర్ నరసింగరావు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు రూ. 4లక్షల విలువైన బంగారు అభరణాలను అపహరించారు.
టెహ్రాన్ : అనుమతి లేకుండా ఇరాన్ తీరంలోకి ప్రవేశించిన 12 మంది భారత జాలర్లను అబు మస్ నేవీ, పర్షియన్ గల్ఫ్ బృందాలు అరెస్టు చేశాయి. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ అధికారులు మీడియాకు వెల్లడించారు. రెండు నౌకల్లో…
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్‌స్కూల్‌ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.