ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం
ఉత్తరాఖండ్,(జనంసాక్షి): యమునోత్రి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పుల్‌చల్ బాడీయూలో రాకపోకలు నిలిచిపోయాయి. పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.
ఉత్తరాఖండ్,(జనంసాక్షి): యమునోత్రి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పుల్‌చల్ బాడీయూలో రాకపోకలు నిలిచిపోయాయి. పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.
కడప: కడప జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 29మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 10 మంది వాసులు కూడా ఉన్నారు.
విశాఖపట్నం,(జనంసాక్షి): రెండు రోజుల్లో వాయవ్య, పశ్చిమల మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన…
ఢీల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై దిగ్విజయ్‌సింగ్ సోనియాతో చర్చించే అవకాశముంది. సోనియాతో భేటీకి ముందు దిగ్విజయ్‌సింగ్ రాహుల్‌గాంధీతో కూడా సమావేశమయ్యారు.
రాయవరం: తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు శివారు ఎర్రమట్టిపురంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 135 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎర్రమట్టిపురంలోని ఓ ప్రైవేటు గోదాము వద్ద తరలించేందుకు సిద్దంగా ఉంచిన…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డిని ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్యలు కలిశారు. రాజకీయపార్టీలకు పంచాయితీ ఎన్నికలతో ప్రమేయం లేకుండా చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు,(జనంసాక్షి): విజయమహల్ గేటు వద్ద పట్టా విరిగిపోవడంతో జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. అధికారలు పట్టాను మరమ్మత్తు చేపట్టారు. మిగతా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇండోనేషియా: ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది.
హైదరాబాద్ : కొంపెల్లిలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సు ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద పార్టీ నాయకులు హాజరయ్యాయి.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తూర్పు ఢిల్లీలోని జఫ్రాబాద్ సమీపంలో నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. పోలీసులు, రెస్య్కూటీంలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.