Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

ఆర్టీసీ బస్సు ,డీసీఎం వ్యాను ఢీ: 20 మందికి గాయాలు

మెదక్‌: సిద్దిపేట మండలం మిట్టపల్లి వద్ద ఆర్టీసీ బస్సు-డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. వీరంతా ఓటు వేసేందుకు వేములవాడ నుంచి నంగునూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

తెలంగాణ

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా

నెన్నెల (ఆదిలాబాద్‌): నెన్నెల మండల కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తమ వసతి గృహంలో పూర్తిస్థాయి వార్డెన్‌లేక సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కనీసం…

ఆదిలాబాద్

గడ్డన్న ప్రాజెక్టుకు వరదనీటి పోటు

బైంసా: పట్టణ సమీపంలోని గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు ప్రాజెక్టులో కలుస్తుంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 357.7మీటర్లకు చేరింది. ప్రాజెక్టు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం

ఆదిలాబాద్‌: సోమవారం నుంచి ఈరోజు ఉదయం వరకూ ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దహెగాంలో 38.7 సెం.మీ, రవీంద్రనగర్‌లో 30.6, జానక్‌పూర్‌లో 18.6 సెం.మీ, రెబ్బనలో 18.3 సెం. మీ వర్షపాతం నమోదైంది.

సీమాంధ్ర

కాంగ్రెస్‌, వైకాపాల మధ్య ఘర్షణ వల్ల ఇద్దరికి గాయాలు

కడప: రాయచోటి మండలం గువ్వల హరినవాడలో పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, వైకాపా మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.

సీమాంధ్ర

బ్యాలెట్‌ పత్రాలను బయటకు తెచ్చిన ఓటరు

చిత్తూరు: జిల్లాలోని బి.ఎన్‌ కండ్రిగ మండలం కంచనపుత్తూరులో రంగయ్య అనే ఓటరు ఓట్లు వేసేందుకు వెళ్లి బ్యాలెట్‌ పత్రాలను బయటకు తెచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

మృతుల కుటుంబాలకు వారం రోజుల్లో సాయం: రఘువీరా

హైదరాబాద్‌: మౌలాలి ఎంజే కాలనీలో గోడకూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వారం రోజుల్లో ఆపద్బంధు పథకం కింద సహాయం అందుతుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఒక కుటుంబానికి రూ. 8.50లక్షలు, మరో కుటుంబానికి రూ. 6.50లక్షలు…

తెలంగాణ

సానుభూతి చూపిన చంద్రబాబు

హైదరాబాద్‌: మౌలాలి ఎంజే కాలనీలో గోడకూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సానుభూతి తెలిపారు. బాధితులను ఆదుకోవాలని  డిమాండ్‌ చేశారు.