Monday, 2 November 2026

July 2013

జాతీయం

సీఎంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏపీ భవన్‌లో సీఎం కిరణ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను అడ్డుకోవద్దని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కన్నీటి పర్వంతమయ్యారు.

తెలంగాణ

హైదరాబాద్‌కు చేరుకున్న సీఆర్పీఎఫ్‌ బలగాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంగళవారం మధ్యాహ్నం నగరానికి సీఆర్పీఎఫ్‌ బలగాలు చేరుకున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు కార్పోరేట్‌ సంస్థల వద్ద భారీగా బలగాలను మోహరించారు.

సీమాంధ్ర

ఆరు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా

గుంటూరు,(జనంసాక్షి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతి భద్రతలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ పంచాయతీలకు ఆగష్టు న ఎన్నికలు నిర్వహించనున్నారు.

తెలంగాణ

రేపు సుప్రీంకోర్టుకు డీజీపీ, సీఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సుప్రీంకోర్టులో కేసు నిమిత్తం  డీజీపీ దినేష్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు సంస్కరణల కేసులో బుధవారం వ్యక్తిగతంగా వారు హాజరు కానున్నారు.

జాతీయం

కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు.

తెలంగాణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, తదితర అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

సీఎస్‌ మహంతితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి మహాంతితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణపై చర్చించినట్లు సమాచారం.

సీమాంధ్ర

జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టిన విద్యార్థులు

ఎచ్చర్ల (శ్రీకాకుళం):బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఎచ్చర్లలో తరగతులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై ర్యాలీ, అందోళన చేపట్టారు. అంతకు ముందు వర్సిటీ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అచార్యులు తులసీరావ్‌,…

తెలంగాణ

ఆగస్టు 1 న మహాధర్నా: బీజేపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆగస్టు 1న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ సాధను తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

జాతీయం

సీడబ్ల్యూసీ నేతలతో తెలంగాణ నేతలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర నేతల లాబీయింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రస్‌ ఎంపీలు, మంత్రులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాంలో భాగంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నేతలతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలి కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం…