Monday, 2 November 2026

July 2013

జాతీయం

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

ముంబయి,(జనంసాక్షి): గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన  బంగారం ధర మంగళవారం  స్వల్పంగా తగ్గింది. రూ. 30 తగ్గిన 10 గ్రాముల బంగారం రూ. 28,445 ధరను నమోదు చేసింది. మరోపక్క  రూ.345 పెరిగిన వెండి రూ. 41,345…

జాతీయం

జైపాల్‌ నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ

ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై ఢిల్లీ జరుగుతున్న పరిణామాలను తెలంగాణ భవన్‌ ఎప్పటికప్పుడు నిశితంగా సమీక్షిస్తుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను గులాబీ దళపతి. టీఆర్‌ఎస్‌ అధినేత ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ భవన్‌లో మేథావులు, నిపుణులతో…

జాతీయం

తెలంగాణకు పూర్తి మద్దతు: ఛత్తీస్‌గఢ్‌ సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృధ్ది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా విడిపోవడానికి తెలంగాణకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన చెప్పారు.

తెలంగాణ

తెలంగాణ ప్రజలకు సుష్మాస్వరాజ్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ ఐకాస నేతలు ప్రజలకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ శుభాకాంక్షలు తెలిపినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాతుతూ…

జాతీయం

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని సీమాంధ్ర నేతలు కలిశారు. ఇవాళ వారితో ఈమె సధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. వారిని సోనియా బుజ్జగించినట్లు తెలుస్తుంది. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని ఆమె వారితో చెప్పినట్లు…

జాతీయం

సోనియాతో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను కలిసి రాష్ట్రాన్ని విభజించొద్దని సీమాంధ్ర నేతలు విజ్ఞప్తి చేశారు. చివరి…

జాతీయం

ప్రధానితో భేటీ కానున్న సీఎం, బొత్స

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో తెలంగాణ అంశంపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీఏ సమన్వయ భేటీ కన్నా ముందు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశం కానున్నారు.

తెలంగాణ

నారాయణను కలిసిన టీ జేఏసీ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను తెలంగాణ జేఏసీ నేతలు కలిశారు. ఎల్లుండి జరిగే జేఏసీ సభకు నారాయణ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు చేస్తుంటే రాష్ట్రపతి పాలన ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.