Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

వర్షం కారణంగా నిలిచిన బొగ్గు గనిలో ఉత్పత్తి

కొత్తగూడెం: వర్షం కురుస్తున్న కారణంగా కొత్తగూడెంలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకు అయిదు వేల టన్నుల వంతున రెండు రోజుల్లో పది వేల టన్నుల బొగ్గు…

జాతీయం

217 ఐఐటీ సీట్లు ఖాళీ

కోల్‌కత్తా: ఐఐటీ మోజు తగ్గడమో, మరో కారణమో తెలియదుకానీ మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత కూడా దేశవ్యాప్తంగా 16 ఐఐటీల్లో మొత్తం 217 సీట్లు ఇంకా భర్తీ కాకుండా మిగిలిపోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ ఐఐటీల్లో ఒక్క దఫానే…

జాతీయం

హసన్‌అలీకి బెయిల్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ,(జనంసాక్షి): మనీల్యాండరింగ్‌ కేసులో నిందితుడు హసన్‌అలీ బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించింది.

తెలంగాణ

నాలుగు గేట్లు నుండి నీరు విడుదల

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు జలాశయంలో నీటిమట్టం 72.5 మీటర్లకు చేరింది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కావడంతో నాలుగు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల…

కరీంనగర్

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ను ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం ముట్టడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రుక్తి చోటు చేసుకుంది.

తెలంగాణ

భారీ వర్షాలకు తెగిన కాలువ

నిజామాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలో జనజీవనం స్తంభించింది. దర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో వర్షాలకు కాలువకు గండి పడింది. దీంతో ఇందల్వాయి, దర్పల్లి గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

జాతీయం

99 తుపాకులతో పాటు ఇద్దరు అరెస్టు

ఢిల్లీ : కారులో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులతో పాటు ఇద్దర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ

భారీ వర్షం వల్ల నిలిచిన రాకపోకలు

వరంగల్‌: జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏటూరునాగారం ఏజెన్సీలోని ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జాతీయం

అనిల్‌ అంబానీకి సమన్లపై నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సాక్ష్యమిచ్చేందుకు అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు సమన్లు జారీ చేయాలని సీబీఐ దాఖలు చేసిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు జూలై 19కి వాయిదా వేసింది. అనిల్‌…