Thursday, 5 November 2026

July 2013

జాతీయం

బీటలు వారిన కేదార్‌నాథ్‌ ఆలయ నిర్మాణం ఏఎస్‌ఐ ప్రాథమిక సర్వేలో వెల్లడి

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో గత నెలలో సంభవించిన వరద బీభత్సం  కారణంగా కేదార్‌నాథ్‌ ఆలయ నిర్మాణం అక్కడక్కడా బీటలు వారిందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలింది. అలయాన్ని పునరుద్ధరించేందుకు గాను ముందుగా ప్రస్తుత…

తెలంగాణ

స్పైస్‌జెట్‌ విమాన సర్వీసులు రుద్దు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజమండ్రి-హైదరాబాద్‌ మధ్య స్పైస్‌జెట్‌ విమానాలు రద్దు అయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌ పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సీమాంధ్ర

ఏసీబీ వలలో చిక్కిన రాయదుర్గం ఏడీఈ

అనంతపురం,(జనంసాక్షి): రైతు నుంచి లంచం తీసుకుంటూ రాయదుర్గం ఏడీఈ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 6 వేల లంచం తీసుకుంటూ ఏడీఈ ప్రసాద్‌, ఆపరేటర్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

తెలంగాణ

నిజాంసాగర్‌లోకి గరిష్ఠ నీటిమట్టం

నిజామాబాద్‌: జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 1382.58 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1909 క్యూసెక్కులుగా నమోదైంది.

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో నాదెండ్ల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో స్పీకర్‌& నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. గౌతం…

జాతీయం

బాలనేరస్థుల వయోపరిమితి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బాల నేరస్థుల వయోపరిమితిని తగ్గించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో చోరీకి పాల్పడిన దుండగులు

కరీంనగర్‌,(జనంసాకి): కొడిమ్యాల మండలం పూడూరులోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

జాతీయం

ఢిల్లీలో 99 తుపాకులు స్వాధీనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి):ఢిల్లీలో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.