Tuesday, 3 November 2026

August 2013

జాతీయం

స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.…

తెలంగాణ

నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సామాచారం అందించారు. పోలీసులు, బాంబ్‌స్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణ

అలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో నిందితుడు అలీఖాన్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

తెలంగాణ

పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్‌లో ప్రైవేటు కళాశాలలకు అనుమతి ఇవ్వొద్దంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

తెలంగాణ

టీఎన్టీవో భవన్‌లో టీ జేఏసీ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నాంపల్లిలోని టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

జాతీయం

దస్త్రాల గల్లంతుపై ఆందోళనకు దిగిన భాజపా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఆందోళనకు దిగింది. ఈ రోజు ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే భాజపా సభ్యులు బొగ్గు కుంభకోణం అంశాన్ని లేవనెత్తారు.

తెలంగాణ

రూపాయి పతనంతో పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌,(జనంసాక్షి): రూపాయి పతనంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులంపై బంగారం ధర రూ. 400 పెరగగా, కిలో వెండి ధర రూ. 700 పెరిగింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తెలంగాణ

రైల్వే కోర్టుకు హాజరైన కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రైల్‌ రోకో కేసులో సికింద్రాబాద్‌ రైల్వే కోర్టుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పద్మారావు, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి కూడా  హాజరయ్యారు.

తెలంగాణ

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరి

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా వినాయకనగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని హుండీని పగలకొట్టి నగదును అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. రెండేళ్లలో ఈ ఆలయంలో  నాలుగుసార్లు చోరీ…

తెలంగాణ

సీఎం కిరణ్‌ సీమాంధ్ర జేఏసీ ఛైర్మన్‌ : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, కన్వీనర్‌ డీజీపీ దినేష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఢిల్లీ బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అడ్డుకోవాలని సీమాంధ్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర…