బ్యాంకు ఖాతాల్లో సోమ్ము మాయం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్త గూడెం ఆంధ్రబ్యాంకులో ఐదుగురి ఖాతాల నుంచి రరూ.1.5లక్షల మాయమయ్యాయి. ఖాతాల్లో నగదు మాయం పై బాధితులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్త గూడెం ఆంధ్రబ్యాంకులో ఐదుగురి ఖాతాల నుంచి రరూ.1.5లక్షల మాయమయ్యాయి. ఖాతాల్లో నగదు మాయం పై బాధితులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ముంబాయి: రూపాయి పతనం కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్ తో రూపాయి విలువ 62 పైసలు తగ్గింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.75.స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: నగరంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజీవ్ 69వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు సద్భావన పరుగు నిర్వహించారు. సోమాజిగూడ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అద్యక్షుడు బొత్ససత్యనారాయణ,…
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఆహరభద్రత బిల్లుపై ఓటింగ్ నెగ్గేందుకు కేంద్రం యత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆహరభద్రత బిల్లులో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమైన భాగస్వాముల మద్దతు పొందేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు…
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయాలు, రాష్ట్ర విభజన పై సీమాంధ్ర నేతల తీరుతో పాటు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
మహారాష్ట్ర: పూణెలో సాధన పత్రిక సంపాదకుడు నరేంద్ర దభోల్కర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా దభోల్కర్‌ను కాల్చి వేశారు. దభోల్కర్ కాల్చివేతను పలువురు జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…
నిజామాబాద్: నౌపేట మండలం బినోలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి చాకలి లక్ష్మణ్ (17) మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. ఆంటోనీ కమిటీతో పాటు, ఇతర పార్టీ…
ముంబాయి: ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 320 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 90 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టి కొనసాగుతోంది.