Thursday, 5 November 2026

August 2013

జాతీయం

లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగుతుంది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి పేర్లను సభలో ప్రస్తావించాలని కాంగ్రెస్‌ ఈ సమావేశంలో కోరింది. సభ్యుల పేర్లను సభలో ప్రస్దావిస్తే సభ నుంచి వాకౌట్‌ చేస్తామని…

తెలంగాణ

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజ్యసభ వాయిదా పడింది. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ

పార్కుల కబ్టాలను అడ్డుకోవాలి: నాగేశ్వర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): జంట నగరాల్లో జరుగుతున్న పార్కుల కబ్జాలను అడ్డుకోవాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన జీహెచ్‌ఎంసీలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకు అక్కడి నుంచి కదలనంటూ…

తెలంగాణ

చర్చల ద్వారా పరిష్కరించుకోండి: హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమ్మె విరమించుకున్నామంటూ జూనియర్‌ డాక్గర్లు హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించు కోవాలని ఈ సందర్భంగా జూడాలకు హైకోర్టు సూచించింది.

జాతీయం

చెప్పులతో దాడి చేయడం హేయమైన చర్య : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావును సీమాంధ్ర ఉద్యమకారులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. హనుమంతరావుపై రాళ్లతో, చెప్పులతో దాడి చేయడం హైయమైన చర్య అని ఆయన…

తెలంగాణ

గవర్నర్‌తో భేటీ కానున్న పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ బొత్స సత్యనారాయణ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ కానున్నారు. కాసేపట్లో ఆయన రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన గవర్నర్‌తో చర్చించనున్నట్లు సమాచారం.

తెలంగాణ

భార్యను చంపిన పోలీసు కానిస్టేబుల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కట్టుకున్న భార్యను కడతేర్చాడొక పోలీసు కానిస్టేబుల్‌. యూసఫ్‌గూడలోని కార్మిక నగర్‌లో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భర్యను చంపి పారిపోతున్న కానిస్టేబుల్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని భావిస్తున్నారు.

తెలంగాణ

ప్రారంభమైన తెలంగాణ జేఏసీ శాంతి దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్‌ వద్ద శాంతి దీక్ష ప్రారంభించింది. ఈ దీక్షలో చుక్కా రామయ్య, జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు, న్యూడెమోక్రసీ నేత…

తెలంగాణ

టీవీ చానళ్ల ఎడిటర్లతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీవీ ఛానళ్ల ఎడిటర్లతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

నిజాంపేటలో బీభత్సవం సృష్టించిన దోపిడీ దొంగలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని నిజాంపేటలో దోపిడీ దొంగల బీభత్సవం సృష్టించింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి 70 వేల రూపాయలు దోచుకెళ్లారు. దీంతో యువకుడి శరీరంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. పోలీసులు అతన్ని నిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.