Thursday, 5 November 2026

August 2013

జాతీయం

రేపటికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. భాజపా సభ్యుడు దిలీప్‌సింగ్‌ జుదేవ్‌ మృతికి సంతాపం తెలిపిన స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

జాతీయం

బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

బెంగళూరు,(జనంసాక్షి): బెంగళూరు నగరంలోని హోసూరు రోడ్డులోని నిమ్హాన్స్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల్లో ఆరుగురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

జాతీయం

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం: 25 మంది మృతి

లక్నో,(జనంసాక్షి): బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బద్లషూట్‌ దగ్గర రైలు ఆపేందుకు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించారు. స్థానికులపై నుంచి రాజ్‌రాణి ఎక్స్‌ప్రెస్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

తెలంగాణ

ఢిల్లీ బయలుదేరిన టీ. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీలో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు.

జాతీయం

జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్మూ,(జనంసాక్షి:) జమ్మూ కాశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.9 గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్‌లోని క్విష్టార్‌లోని భూకంప కేంద్రకాన్ని అధికారులు గుర్తించారు.

తెలంగాణ

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కొనసాగుతుంది. తెలంగాణలో 22 హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు, 15 వేల ర్యాంకులలోపు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ రోజు జరుగుతుంది. ఈ నెల 22 వరకు వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియ కొనసాగుతుందని…

తెలంగాణ

నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ వివిధ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించారు. ఆసిఫాబాద్‌ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా లక్ష్మి, అలంపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా మంద శ్రీనాథ్‌, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జీగా విఠల్‌రావు ఆర్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సెక్రటరీగా…

జాతీయం

ఐబీఎల్‌లో నేటి మ్యాచ్‌లు

ముంబయి,(జనంసాక్షి): ఐబీఎల్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌ హాట్‌షాట్స్‌ జట్టు పుణె పిస్టర్స్‌తో తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈఎస్‌పీఎన్‌, స్టార్‌స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టపోయాయి. రూపాయి విలువ  మరింతగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 62.35 గా ఉంది.

జాతీయం

నేడు ఆంటోని కమిటీతో భేటీ కానున్న టీ కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఈ రోజు ఢిల్లీలో ఆంటోని కమిటీతో సమావేశం కానున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు కమిటీ ముందుకు హాజరై రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాలు, సమస్యలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు సీమాంధ్ర…