Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

జూడాల సమ్మెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె విరమించుకుని వెంటనే విధుల్లో చేరాలని కోర్టు జూడాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవదద్దని జూనియర్‌ డాక్టర్ల తరుపున న్యాయవాదికి కోర్టు సూచించింది.

తెలంగాణ

బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) నగరంలోని బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,410 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,100 గా…

తెలంగాణ

అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం,  20 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జాతీయం

సింధురక్షక్‌ నుంచి మూడు మృతదేహాలు లభ్యం

ముంబయి,(జనంసాక్షి:) ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సింధురక్షక్‌ జలాంతర్గామి నుంచి ఈ రోజు మూడు మృతదేహాలను వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు నావికాదళం తెలిపింది.

తెలంగాణ

తెలుగుజాతి గౌరవాన్ని కాపాడుకుందాం: డి.శ్రీనివాస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాలుగా విడిపోయి ఒకే జాతిగా కలిసుందామని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. తెలుగుజాతి గౌరవాన్ని కాపాడుకుందామని తెలిపారు. దేశంలోనే తెలుగువారు తెలివైన వారని గుర్తు చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రల్లో తెలుగువారు ఉన్నత…

తెలంగాణ

4 వేలు పెరిగిన పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శ్రావణ శుక్రవారం నాడు మహిళలకు బంగారం షాకిచ్చింది.  ఈ వారంలో రూ. 4 వేల రూపాయల ధర పెరిగిన బంగారం ఈ రోజు ఒక్కసారిగా రూ. 1500 పెరిగింది. బంగారం ధర ఈ రోజు దాదాపుగా రూ.…

జాతీయం

కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ రూ. 62 లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 400 పాయింట్లకు పైగా నష్టంలో…

తెలంగాణ

చిన్నారి మాన్వీ మృతదేహం లభ్యం

హైదరాబాద్‌,(జనంసాక్షి):మూసీ నదిలో నిన్న చేజారి కొట్టుకుపోయిన చిన్నారి మాన్వీ మృత దేహం లభ్యమయింది. హయత్‌నగర్‌ మండలం మర్రిపల్లి వద్ద మృతదేహం  లభ్యమైనట్లు సమాచారం.

వార్తలు

గోదావరిలో దంపతుల గల్లంతు

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద స్నానానికి వెళ్లిన దంపతులు గల్లంతయ్యారు. రామపాదల రేవు వద్ద స్నానానికి వెళ్లిన దంపతులు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.