తన్వీ కోసం కొనసాగుతున్న గాలింపు
హైదరాబాద్: ప్రమాదవశాత్తు నిన్న నాగోల్ వద్ద మూసీ నదిలో కొట్టుకు పోయిన తన్వీ (2) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు సాయంతో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్: ప్రమాదవశాత్తు నిన్న నాగోల్ వద్ద మూసీ నదిలో కొట్టుకు పోయిన తన్వీ (2) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు సాయంతో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
స్థిరంగా ఉపరితలం ఆవర్తనం విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళఖాతంలొ 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కోస్తాతీరాన్ని ఆనుకుని…
ఢిల్లీ: ఈ రోజు దేశ వ్యాప్తంగా వృద్దులు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. హక్కుల రక్షణ, చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి డిమాండ్‌లతో ఈ నిరసనలు తెలపనున్నారు.
హైదరాబాద్: నార్కట్‌పల్లి వద్ద నిన్న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా సీనియర్ నేత లాల్‌జాన్ బాషా అంత్యక్రియలు ఇవాళ గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తేదేపా అధినేత చంద్రబాబుతో పాటు. పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు.…
న్యూజిలాండ్: న్యూజిలాండ్‌లోని కుక్స్ట్రీట్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది.
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటాపురం మండలం చొక్కాలలో వర్షానికి రెండిళ్లు నేలకొరిగాయి. ఈ ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది.
హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భారీగా వర్షం కురిసింది. లక్డీకాపూల్, ఖైరాతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వాహనచోదకులు, ప్రయిణికులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలంలోని చీకుపల్లివాగు ఉద్ధృతంగా వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
ముంబాయి: సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో గల్లంతైన 18మంది సిబ్బంది ఆచూకి ఇంకా తెలియలేదు. ప్రతి కూల పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సింధు రక్షక్ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం…
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వాంకిడి మండలంలో కురిసిన భారీ వర్షానికి చిక్లివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.