Wednesday, 4 November 2026

September 2013

జాతీయం

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

గుజరాత్‌ : గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. వడోదర, బరుచ్‌ జిల్లాల్లో లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి అహ్మదాబాద్‌ -ముంబాయి మార్గంలో రవాణ వ్యవస్థ స్తంభించింది.

జాతీయం

సోనియాతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఆధినేత్రి సోనియాగాంధీ తో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ భేటీ అయ్యారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై సోనియాకు వివరించినట్లు సమాచారం.

హైదరాబాద్

వేతనాలు పెంచాలని కేంద్ర కార్మికసంఘాల భారీ ప్రదర్శన

హైదరాబాద్‌ : కనీస వేతనాలు ,పించన్లు పెంపుదల కోరుతూ ఆరు కేంద్ర కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన చేపట్టాయి. భారీ సంఖ్యలో పాల్గొన్న కార్మికులు సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి.

జాతీయం

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన అటార్నీ జనరల్‌

ఢిల్లీ : సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్‌ బి. ఈ . వాహనవతి క్షమాపణలు చెప్పారు. బొగ్గు కుంభకోణం వాదనల సమయంలో సహనం కోల్పోయినందుకు క్షమాపణలు చెప్పినట్లు వాహనవతి తెలిపారు.

హైదరాబాద్

విద్యార్థి సంఘాలతో టీ జేఏసీ సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కార్యాలయంలో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 29న జరిగే సకల జనుల భేరీ, భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

అంతర్జాతీయం

యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ

వాషింగ్టన్‌ : అమెరికా లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆమెను నామినేట్‌ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్‌…

నిజామాబాద్

యువతిపై అత్యాచారం.,ఆపై హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని సారంగాపూర్‌ గ్రామ శివారులో యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు మెదక్‌ జిల్లా బూరుగుపల్లికి చెందిన అనిత గా గుర్తించారు.

హైదరాబాద్

అద్దె కార్ల పేరుతో భారీ మోసం

హైదరాబాద్‌ : అద్దెకార్ల పేరుతో భారీ మోసం జరిగింది.నగరంలోని డేల్టాక్యాబ్స్‌ బిచాణా ఎత్తేసింది.దీని నిర్వాహకులు సుమారు 700 మంది కస్టమర్లకు రూ.10కోట్ల మేర కుచ్చు టోపి పెట్టినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ…

జాతీయం

విటమిన్‌ మాత్రలు వికటించి విద్యార్థుల అస్వస్థత

ఒడిశా : పూరీ జిల్లాలోని చిలిక, నూపాడలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చిన్నారులకు విటమిన్‌ మాత్రలను పంపీణీ చేశారు. 300 మందిచిన్నారులకు మాత్రలను పంపిణీ చేయగా వారిలో 177 మంది చిన్నారులు తీవ్రమైన వాంతులు,విరేచనాలు, కడుపునొప్పితో ఆస్వస్థతకు గురయ్యారు.…