Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

జంటపేలుళ్ల కేసు నిందితుల రిమాండ్‌ను పొడిగించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు నిందితులకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ నెల 17వరకు రిమాండ్‌ పొడిగించింది. నిందితులు అసదుల్లా , భత్కల్‌ను ఎన్‌ఐఏ అధికారులు చర్లపల్లి జైలుకు తరలించారు.

హైదరాబాద్

ఈనెల 18న వైకాపాలో చేరత : మాజీ మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌ : మాజీ మంత్రి విశ్వరూప్‌ ఈ నెల 18న వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్రకోసం జగన్‌ మాత్రమే పోరాడుతున్నారని అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను…

హైదరాబాద్

పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్‌ : వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్‌ రూరల్‌ పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్దనుంచి 580 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి,…

హైదరాబాద్

ఎంబీబీఎస్‌ మొదటిసంవత్సరం ఫలితాలు విడుదల

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం : ఈ ఏడాది జూలై – ఆగస్టులో జరిగిన మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రెండో సంవత్సరం ఈ నెల 17న నుంచి ప్రారంభమవుతాయని వర్శిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు.

హైదరాబాద్

ఎర్రగడ్డ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్‌ : ఎర్రగడ్డ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పేషెంట్‌ భార్యపై వార్డుబాయ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

దీక్ష విరమించిన విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ రఘు

హైదరాబాద్‌ : ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ రఘు తన 48 గంటల దీక్షను విరమించారు. రఘుకు నిమ్మరసం ఇచ్చి తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కొదండరాం దీక్షను విరమింపజేశారు.

హైదరాబాద్

గవర్నర్‌ను కలువనున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బర్తరఫ్‌ కోరుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాసేపట్లో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. రాష్ట్ర పరిస్థితులతో పాటు, సీఎం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతని తమ్ముడు సతీష్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయాలను గవర్నర్‌కు నివేదించనున్నారు.

జాతీయం

బాబు దీక్షకు అనుమతి లేదు : ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌

న్యూఢిల్లీ :ఏపా భవన్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నాడని సెంట్రల్‌ హోం ,సెక్రెటరీ, ఢిల్లీ కమిషనర్‌ ,ఈసీకి ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లేఖ రాశారు.

అంతర్జాతీయం

నైజీరియాలో తెలుగోడి దారుణ హత్య

నైజీరియా : నైజీరియా దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజీనీర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళిని గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపారు. మృతుడు వరంగల్‌ జిల్లా లింగాపురం గ్రామానికి చెందిన చంద్రమౌళిగా గుర్తించారు.

జాతీయం

ఢిల్లీలో భవనం కూలిలో ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని బారా హిందూరావ్‌ ప్రాంతంలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో ఒకరి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. శిధిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.