Wednesday, 4 November 2026

November 2013

జాతీయం

జైరాం రమేష్‌తో ముగిసిన జలవనరులశాఖ అధికారుల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో కేంద్ర జలవనరుల శాఖ అధికారల సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు జలవనరుల పంపిణీ, నిర్వహణ వినియోగంపై జీవోఎం చర్చించింది. నీటి పంపిణీలు, నిర్వహనపై జీవోఎంకు అలోక్‌రావత్‌ నేతృత్వంలోని…

జాతీయం

ముజఫర్‌నగర్‌ జిల్లాలో యువతిపై అత్యాచారం

ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా జోలి గ్రామంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఎస్సీ కుటుంబానికి చెందిన యువతి నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్తుండగా ఓ యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు…

హైదరాబాద్

కేసీఆర్‌తో ముగిసిన ఐకాస నేతల సమావేశం

హైదరాబాద్‌ : తెరాస అధినేత కేసీఆర్‌తో ఐకాస నేతల సమావేశం ముగిసింది. అనంతరం కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఢిల్లీలో చాటుతామన్నారు. రేపు అఖిలపక్ష సమావేశానికి హాజరువుతున్న కేసీఆర్‌తో ఈ అంశాలపై చర్చించినట్లు కోదండరాం తెలిపారు.

జాతీయం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలు ఖారరు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబరు 5నుంచి 20వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

హైదరాబాద్

చింతలపూడిలో పట్టపగలు చోరీ

హైదరాబాద్‌ : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో దుండగులు రూ.4.9లక్షలు అపహరించారు. ఈరోజు ఉదయం బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తున్న భారత్‌ గ్యాస్‌ ప్రతినిధి నుంచి దుండగులు డబ్బు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీసులు కేసు…

హైదరాబాద్

జానారెడ్డి నివాసంలో టి.కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. జీవోఎం ముందు పెట్టాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్‌ యూటీ, భద్రాచలం అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి,…

జాతీయం

ముగ్గుర్ని కాల్చి చంపిన మావోయిస్టులు

బీహార్‌ : బీహర్‌లోని గయ జిల్లా మోహన్‌పూర్‌లో ముగ్గురు గ్రామస్థులను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో గయ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అంతర్జాతీయం

ఇరు వర్గాల మధ్య కాల్పులు : ఇద్దరి మృతి

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతలోని పార్క్‌ స్ట్రీట్‌ వద్ద ఆస్తి వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

హైదరాబాద్

సీబీఐ కోర్టుకు హాజరైన జగన్‌

హైదరాబాద్‌ : వైకాపా అధ్యక్షుడు జగన్‌ పెన్నా సిమెంట్స్‌ ఛార్జీషీట్‌లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పెన్నా ప్రతాన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.

జాతీయం

పోలీసులపై మావోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్‌ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దంతేవాడ జిల్లా కిత్రిరాస్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మవోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దంతేవాడ జిల్లా ధనికార్కాలో రెండు టిఫిన్‌ బాక్స్‌ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని…