2014లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం సి. రామచంద్రయ్య
కడప: తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే 2014లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, డీసీసీ అధికార ప్రతినిధి మురళీ ప్రమాణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడిన వైకాపా మూడో స్థానానికే పరిమితమైందని పేర్కొన్నారు.