బీజేపీ సీనియర్ నేత అద్వానీ
న్యూఢిల్లీ, జనవరి 19 (జనంసాక్షి) :
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం తగదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. 2004 ఎన్నికల్లోనూ ఇలాగే అతి విశ్వాసానికిపోయి ఓటమి పాలయ్యామని ఆయన గుర్తు చేశారు. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి అద్వానీ మాట్లాడారు. దశాబ్దం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో అశ్రద్ద తగదని హితవు చెప్పారు. అతివిశ్వాసంతో వ్యవహరించరాదని, దగ్గర దారుల్లో విజయానికి విజయానికి చేరువ కాలేమని, కష్టపడి పనిచేస్తే ఫలితాలు వుంటాయని అన్నారు. ముస్లిం మైనార్టీల్లో బిజపి పట్ల నెలకొన్న అవిశ్వాసాన్ని తొలిగించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. వారిని ఎవరు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారో తెలియజేయాలని, వారు ఓట్లేసిన, వారి సంక్షేమానికి కృషి చేయలేదు అని మైనార్టీల్లో చైతన్యం తీసుక రావాలని చెప్పారు. బిజెపి అంతర్గతంగా మానవీయతకు ప్రాధాన్యతనిస్తుందని అద్వానీ, మత, కుల, భాషా పరంగా వివక్షా ప్రదర్శించరాదని కార్యకర్తలకు, నేతలకు హితవు చెప్పారు. మెజార్టీ, మైనర్టీ అనే పేర్లతో కొందరు వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని, కానీ తమ పార్టీ ప్రతి ఒక్కరి కోసం పని చేస్తుందని అద్వానీ చెప్పారు. ఎన్నికల్లో విజయం పట్ల విశ్వాసంతో నిండు కుండాలా ఉందని, ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడి పేరు ప్రకటించినందుకు అద్వానీ, పార్టీ అధ్యక్షులు రాజ్‌నాధ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అంత ఈజీ కాదు (కిక్కర్) 2014 ఎన్నికల్లో గెలుపుపై అతివిశ్వాసం వద్దు




