Tuesday, 3 November 2026

నారాయణకు మాతృవియోగం

పలువురి పరామర్శ
హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తల్లి ఆదిలక్ష్మి(83) ఆదివారం ఉదయం మృతి చెందారు. సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ బి. వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య, వైసిపి నేత భూమన కరుణాకర్‌రెడ్డి, లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, ఎంఆర్‌పిఎస్‌ నేత మందకృష్ణ మాదిగ, ప్రజాగాయకుడు గద్దర్‌, యునైటెడ్‌ సమతా పార్టీ నేత కరణం తిరుపతినాయుడు, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నేతలు నారాయణను పరామర్శించారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *