Tuesday, 3 November 2026

January 2014

నల్లగొండ

భారీ అగ్ని ప్రమాదంలో రూ. 18 కోట్ల ఆస్తి నష్టం

బీబీనగర్‌ : నల్గొండ జిల్లా బీబీనగర్‌ పట్టణంలో శ్రీయం ఆగ్రోకెమికల్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కంపెనీలో మిసైల్‌ ట్యాంకర్‌ను ఆన్‌లోడ్‌ చేస్తుండగా స్పార్క్‌ ఏర్పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బీబీనగర్‌, చౌటుప్పల్‌ ప్రాంతాల నుంచి…

హైదరాబాద్

తెలుగు మహిళల ఆందోళన,అరెస్టు

హైదరాబాద్‌ : మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేవకంగా తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. ఇందిరాపార్కునుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

హైదరాబాద్

అర్ధాంతరంగా అస్తమించిన ‘ఉదయ కిరణ’ం

హైదరాబాద్‌ : తొలి ‘చిత్ర’మే ప్రతిష్ఠాత్మక ఉషాకిరణ్‌ మూవీస్‌లో చేసే అవకాశం…సంచలన విజయం… వెనువెంటనే మూడు వరస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ హీరోగా ముద్ర. యువతలో మంచి ఆదరణ. లవర్‌బాయ్‌ ఇమేజి. ఇవన్నీ హీరో ఉదయ్‌ కిరణ్‌ పరిశ్రమలో…

జాతీయం

ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ఖాతాలనను కాగ్‌ ఆడిట్‌ చేయవచ్చు : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ : ప్రైవేట్‌ టెలికాం సంస్థల ఖాతాలను కాగ్‌ ఆడిట్‌ చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు సోమవారం పేర్కొంది. న్యాయమూర్తుల ప్రదీప్‌ నంద్రజోగ్‌, వి. కామేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ట్రాయ్‌ చట్టం కింద కాగ్‌ ఈ అడిట్‌ చేయవచ్చని తీర్పును…

హైదరాబాద్

మధ్యాహ్నం మరోసారి బీఏసీ సమావేశం

హైదరాబాద్‌ : ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. అయినా ముసాయిదా బిల్లుపై చర్చకు ఏకాభిప్రాయం కుదురకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి బీఏసీ సమావేశం కానుంది. స్పీకర్‌…

హైదరాబాద్

శాసన సభ సమావేశాల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 16కు బదులుగా 17నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 18న శనివారం కూడా శాసనసభ సమావేశం ఉంటుంది.

వార్తలు

జస్టిస్‌ గంగూలీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఎ.కె. గంగూలీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్‌ మానవహక్కుల సంఘం ఛైర్మన్‌ పదవి నుంచి గంగూలీని తొలగించకుండా కేంద్రాన్ని నిలువరించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్‌…

హైదరాబాద్

ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. ఓయూ విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

హైదరాబాద్

ఏసీబీకి చిక్కిన అటవీ శాఖాధికారి

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా దగదర్తి టోల్‌ ప్లాజా వద్ద నెల్లూరు డివిజన్‌ అటవీశాఖాధికారి ఎస్‌. నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. నాగేశ్వరరావు వద్ద అనధికారికంగా ఉన్న రూ. 11.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

కర్నూల్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిన రైతులు

హైదరాబాద్‌ : కేసీ కెనాల్‌కు నీటి విడుదల నిలిపివేయాడాన్ని నిరసిస్తూ రైతులు కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. వారు ఎన్టీఆర్‌ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు.