Tuesday, 3 November 2026

January 2014

హైదరాబాద్

ఉదయ్‌కిరణ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

హైదరాబాద్‌: ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సినీ హీరో ఉదయ్‌ కిరణ్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోలీసులు ఉదయ్‌ కిరణ్‌ మృతిపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్

కొనసాగుతున్న బీఏసీ సమావేశం

హైదరాబాద్‌ : స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం కొనసాగుతోంది. ముసాయిదా బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైందా లేదా అని బీఏసీ సమావేశంలో అక్బరుద్దీన్‌ ప్రశ్నించగా, ఆ వివాదంతో సంబంధం లేకుండా చర్చను కొనసాగిద్దామని సభాపతి సమాధానమిచ్చారు. సమైక్య తీర్మానం…

నల్లగొండ

శ్రీఎం ల్యాబ్‌ అగ్ని ప్రమాదం

బీబీనగర్‌ : నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలో శ్రీఎం ల్యాబ్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్లు పేలుతుండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరటగగలేదు. అగ్నిమాపక శాఖలు సమాచారమందించారు.

హైదరాబాద్

సమ్మె నోటీసిచ్చిన ఈయూ, టీఎంయూ నేతలతో కమిషనర్‌ చర్చలు

హైదరాబాద్‌ : సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూ నేతలతో కార్మిక శాఖ కమిషనర్‌ చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఆర్టీసీలో ఒప్పంద కండక్టర్లు, డ్రైవర్ల క్రమబద్దీకరణకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. నెలాఖరులోగా…

హైదరాబాద్

విజిలెన్స్‌ తనిఖీల్లో ఇనుము, ధాన్యం లారీల పట్టివేత

హైదరాబాద్‌ : అనంతరం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు వద్ద విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా కర్ణాటక తరలిస్తున్న 9 లారీల ఇనుము, 2 లారీల ధాన్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

ఏపీఎన్జీవోల నూతన కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌ : నిన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన ఏపీఎన్జీవోల నూతన కార్యవర్గం నేడు సమావేశమైంది. సంఘ భవిష్యత్‌ కార్యాచరణపై కార్యవర్గం చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌ : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయ దిశలో 230కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదిలి సాయంత్రం శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణం…

జాతీయం

భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

పనాజి: గోవాలో భవనం కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. కనకొనా పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోగా శిథిలాల తొలగింపు ఇంకా ఆలస్యమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో డజను మంది దాకా ఇంకా శిథిలాల్లో చిక్కుకుని…

హైదరాబాద్

సభ నిర్వహణపై పయ్యావులతో శైలజానాథ్‌ చర్చ

హైదరాబాద్‌: కొత్తగా శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతులు చేపట్టిన మంత్రి శైలజానాథ్‌ శాసనసభ నిర్వహణపై తెదేపా నేత పయ్యావుల కేశవ్‌తో చర్చించారు. సభ నిర్వహణకు తెదేపా సహకరించాలని మంత్రి కోరారు. విభజన బిల్లుపై సమగ్ర సమాచారం ఇస్తే చర్చకు…

హైదరాబాద్

హిందువుల ఐక్యత కోసం కృషి చేయాలి: తొగాడియా

సంగారెడ్డిమున్సిపాలిటీ: హిందువుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాదక్షులు ప్రవీణ్‌ తొగాడియా అన్నారు. సోమవారం ఉదయం మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌ నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…