Wednesday, 4 November 2026

April 2015

హైదరాబాద్

కుక్కల బెడద వుంటే ఫోన్ చేయండి:జీహెచ్ఎంసీ

హైదరాబాద్: నగరంలో కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… కుక్కల బెడద తీవ్రమైతే జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయాలని కోరారు. వీధి కుక్కలను పట్టుకుని రేబిస్ వ్యాక్సిన్‌లు ఇస్తున్నట్లు…

సీమాంధ్ర

ఎన్టీఆర్ బీచ్ కు రూ.50కోట్లు

తూర్పుగోదావరి:కాకినాడ వాకలపూడి సమీపంలోని ఎన్టీఆర్ బీచ్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర టూరిజం శాఖ రూ.50.76 కోట్ల నిధులు మంజూరు చేసిందని టీడీపీ ఎంపీ తోట నరసింహం తెలిపారు.

జాతీయం

గోవాలో స్మృతి ఇరానీకి చేదు అనుభవం…

హైదరాబాద్:గోవాలో ఓ బట్టల దుకాణానికి వెళ్ళిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేంజింగ్ రూమ్ లో కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు స్మృతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కెమెరా, హార్డ్…

జిల్లా వార్తలు

డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు:హరీశ్

మెదక్:త్వరలో డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని మంత్రిహరీష్‌రావు ప్రకటించారు. టేక్మాల్ లో ఆయన మిషన్ కాకతీయను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ, డ్వాక్రా మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ. 10…

సీమాంధ్ర

10లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్:చంద్రబాబు…

చిత్తూరు:నవ్యాంధ్రలో నూతన పరిశ్రమల కోసం 10లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. కడప జిల్లాకు పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయని…. ఇసుక ద్వారా రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.

హైదరాబాద్

మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్

హైదరాబాద్: మలేషియా ఓపెన్ సూపర్ సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్ గెలుపొందింది. 21-11,21-18,21-17 తేడాతో 15వ ర్యాంక్ సన్ యూ పై సైనా నెహ్వాల్ గెలుపొందింది.

Featured News

మోదీ పాపులారిటీ తగ్గిందా?

ఎన్డీఏ ప్రభుత్వాన్ని ‘ఘర్ వాపసి’ కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇండియా టుడే-సిసిరో సర్వే నిర్వహించింది. ‘ఘర్ వాపసి’ కార్యక్రమంతో ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ బాగా తగ్గిందని ఈ సర్వే…

Main

‘సూర్యాపేట’ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దుగ్గల్

నల్గొండ:జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దుగ్గల్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ ఆవరణలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట బస్టాండ్ లో ఆగంతుకులు పోలీసులపై కాల్పులు జరపడం, ఇద్దరు పోలీసులు మరణించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఘటనకు జిల్లా…

కరీంనగర్

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు…

కరీంనగర్:కొండగట్టు హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం సందర్భంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. దీంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు.