Wednesday, 4 November 2026

May 2015

వార్తలు

18 నుంచి అమేథిలో పర్యటించనున్న రాహుల్

ఢిల్లీ:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన స్వంత నియోజకవర్గం అమేథిలో ఈనెల 18 నుంచి 20 వరకు పర్యటించనున్నారు. 19న ఆయన కాసర గ్రామంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రాజీవ్‌సింగ్ వెల్లడించారు.…

జాతీయం

నేపాల్ లో మరోసారి భూప్రకంపనలు

హైదరాబాద్: నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదయ్యింది. అంతే కాకుండా బీహార్ లోనూ పలు చోట్ల స్వల్ప భూప్రకంనలు రావడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు…

హైదరాబాద్

రైతులను ఆత్మహత్యకు పురికొల్పింది కాంగ్రెస్సే: తుమ్మల

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, రైతులను ఆత్మహత్యకుల పురి కొల్పింది కాంగ్రెస్సేనని టి. మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనలో మూడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని… వారిని మాత్రమే…

జిల్లా వార్తలు

పేలిన డైనమేట్ :ఒకరి మృతి

నల్గొండ:చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గుట్టపై డైనమేట్‌ బాంబ్‌ పేలి ఒకరు మృతి చెందారు. గుట్టలోని బండరాళ్లను పగలకొట్టేందుకు అమర్చిన డైనమేట్ వల్లనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహబూబ్ నగర్

కొత్తూరు ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు

మహబూబ్ నగర్: కొత్తూరులోని ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. రూ. కోట్ల యూరియాను పక్కదారి పట్టించిన నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వారిలో సీనియర్ మేనేజర్ సూర్యశంకర్ రెడ్డి…

హైదరాబాద్

జూన్ 8న భారీ బహిరంగ సభ:ఏపీ సర్కార్…

హైదరాబాద్:రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా జూన్ 8న భారీ బహిరంగ సభ వేదికను ప్రభుత్వ ఖరారు చేసింది. ఈ బహిరంగ సభను ప్రభుత్వం గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఏడాది పాలన, ఆర్థిక…

హైదరాబాద్

వెంకయ్యనాయుడి ఇంటిని ముట్టడించిన టి.అడ్వొకేట్స్ జేఏసీ

హైదరాబాద్: తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడించారు. న్యాయవాదులు బంజారాహిల్స్‌లోని మంత్రి ఇంటిని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ర్టానికి వెంటనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

హైదరాబాద్

తెలంగాణ లో రేపు పదో తరగతి ఫలితాలు…

హైదరాబాద్: పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎస్‌ఎస్‌సీ ఫలితాలను విడుదల చేయనున్నారు.

హైదరాబాద్

యాక్సిస్ బ్యాంక్ కు బాంబు బెదిరింపు

హైదరాబాద్:ముసారంబాగ్ లోని యాక్సిస్ బ్యాంక్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేపట్టారు.

వార్తలు

కరీంనగర్ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన…

కరీంగనర్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. కాటారం ఐకేపీ, సహకార సంఘాల ఆవరణలో ఉన్న తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాటారం కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.