Tuesday, 3 November 2026

September 2015

సీమాంధ్ర

పోర్టు కోసం రైతుల భూములు తీసుకుంటే ఊరుకోం

 మచిలీపట్నం పోర్టు నిర్మాణం పేరిట రైతుల నుంచి భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ హెచ్చరించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండువేల ఎకరాలతో ఆరు బెర్తులు నిర్మించుకోవచ్చని, కాని 33 వేల ఎకరాల…

తెలంగాణ

కలాం లాంటి వ్యక్తి తెలుగు ప్రజలలో పుట్టాలి:

హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కలాంకు సంతాపం తెలిపే తీర్మానాన్ని టీడీపీ బలపరిచింది. కలాం మరణం దేశం మొత్తాన్ని కలచివేసిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలాం చనిపోతే తన మనిషి చనిపోయారని దేశ ప్రజలంతా బాధపడ్డారని ఆయన…

ఆదిలాబాద్

కల్తీ కల్లు దందాపై అధికారుల చర్యలేవి?

ఆదిలాబాద్‌,  జిల్లాలోని నిర్మల్‌, బాసర ప్రాంతాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య 65 మందికి చేరింది. అస్వస్థతతో బాధితులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కల్తీ కల్లు దందాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిర్మల్‌లో కల్తీకల్లు దందాను…

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

,రంగారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్‌ మండలం కొత్తగడి గ్రామంలో అప్పుల బాధతో సత్తయ్య అనే 45 ఏళ్ల రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు

సీమాంధ్ర

గుంటూరు ప్రధాన ఆసుపత్రిలో ప్రక్షాళన ప్రారంభం

గుంటూరు గుంటూరులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 500 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆసుపత్రి ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేకాధికారి రఘు పర్యవేక్షణలో ఆసుపత్రిలో ప్రక్షాళన పనులు మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

హైదరాబాద్‌రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, చింతల, ప్రభాకర్‌లు చెప్పారు. వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రంగా వెళ్లారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించలేక పోతుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.…

హైదరాబాద్

రైతుల సమస్యలపై పోరాడుతాం

హైదరాబాద్‌,:తమను అవమానించినా, కొట్టినా సహనంతో సభలోనే ఉండి రైతుల సమస్యలపై పోరాడుతామని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. రైతుల ఆత్మహత్యలే ప్రధాన అంశంగా తాము అసెంబ్లీలో తీసుకుంటామన్నారు. అసెంబ్లీని కనీసం 15 రోజులు నడపాలని ఆయన…

మహబూబ్ నగర్

మరో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సీమాంధ్ర

మూడు దేవాలయాల్లో చోరీలు

నెల్లూరు, బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెంలోని మూడు దేవాలయాల్లో గుర్తు తెలియని దొంగలు చోరీలు చేశారు. గ్రామంలోని రామాలయం, పోలేరమ్మ, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో రెండు లక్షల రూపాయలకు పైగా విలువగల హుండీలు, దేవుని నామాలను ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో చోరీలతో పోలీసులు…

సీమాంధ్ర

బ్రౌన్‌ షుగర్‌ ముఠా అరెస్ట్‌

కర్నూలు, : కర్నూలు జిల్లా ఆత్మకూరులో 14 మంది సభ్యులున్న బ్రౌన్‌షుగర్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. గుట్టుగా జిల్లాలో బ్రౌన్‌షుగర్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ అరెస్టులు జిల్లాలో సంచలనం సృష్టించాయి.