Tuesday, 3 November 2026

237 పరుగులకు ఐర్లాండ్ ఆలౌట్

ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందుంచింది. గ్రూపు-బిలో భాగంగా నేపియర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ పూర్తి ఓవర్లలో 237పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ కెప్టెన్ పోర్టర్ ఫీల్డ్ (107) సెంచరీతో్ రాణించి జట్టును ఆదుకున్నాడు. కాగా ఇతర ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఐర్లాండ్ ను కట్టడి చేశారు. పాక్ బౌలర్లు సొహైల్ ఖాన్, రహత్ అలీ, వాహబ్ రియాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *