శ్రీహరికోట, ఏప్రిల్ 4 (జనంసాక్షి) :
భారత అంతరిక్ష పరిశోధనలో మరోమైలు రాయి చేరింది. తన విజయపతాకను సగర్వంగా ఎగు రేసింది. శ్రీహరికోట నుంచి ప్ర యోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-24 వాహకనౌక విజయవంతంగా నాలుగు దశలూ అధిగమించి ఐఆర్‌ఎన్ ఎస్‌ఎస్ -1 రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ – 1బి) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. ప్రయోగం విజయవంతమైంది. దీం తో షార్ లో శాస్త్రవేత్తలు ఆనందానికి అవధులు లేకుం డా పోయాయి. నిర్దేశించిన విధంగానే మొత్తం 20 నిమిషాల 25 సెకన్లకు ఉపగ్ర హం నాలు గు దశలనూ దాటుకుని కక్ష్యలోకి చేరింది. దీంతో షార్‌లో శాస్త్రవేత్తల ఆనందా నికి అవధులు లేకుండా పోయాయి. పీఎస్‌ఎ ల్‌వీ -సి 24 నిర్దేశిత సమయం 5 గంటల 14 నిమిషాలకు నింగికి ఎగసింది. ఈ వాహక నౌక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1 బీ ఉపగ్రహాన్ని విజ యవంతంగా కక్ష్యలోకి తీసుకెళ్లింది. సమా చార వ్యవస్థకు దోహదం చేయనున్న ఈ ఉప గ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అం తరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ దగ్గర ఉండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్తు కూడా షార్ సెంటర్‌కి విచ్చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ 24 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశలను అధికమించి 1400 కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బిని రాకెట్ కక్ష్యలోకి తీసుకువెళ్లింది. సమాచార వ్యవస్థ అభివృద్ధికి పీఎస్‌ఎల్‌వీ-సీ 24 రాకెట్ దోహదపడనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ నేవిగేషన్‌కు సంబంధించిన రెండో ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీని ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్‌లో రూపొందించిన ఈ ఉపగ్రహం ద్వారా స్థితి నేవిగేషన్, సమయం (పీఎన్‌టీ)కి సంబంధించి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సేవలు అందనున్నాయి. ఈ ప్రయోగానికి ఉపయోగిస్తున్న రాకెట్ (పీఎస్‌ఎల్‌వీ-సీ24) అభివద్ధి పరచబడిన ఎక్స్‌ఎల్ తరహాకు సంబంధించింది. ఆరోసారి ఈ ఎక్స్‌సెల్ రాకెట్‌ను ప్రయోగించారు. గతంలో పీఎస్‌ఎల్‌వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ17 ద్వారా జీశాట్-12, పీఎస్‌ఎల్‌వీ-సీ19 ద్వారా రీశాట్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ, పీఎస్‌ఎల్‌వీ-సీ24 ద్వారా మార్క్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. నాలుగు దశలుగా పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రయోగాన్ని నిర్వహించారు. తొలిదశలో 138 టన్నుల ఘన ఇంధనం కలిగిన ఇంజన్ చుట్టూ ద్రవ ఇంధనంతో పనిచేసే 6 స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. కౌంట్‌డౌన్ జీరోకు చేరుకోగానే స్ట్రాపాన్ బూస్టర్లు మొదటిదశ ఇంజన్‌తో అడ్డుకొని సెకనుకు 452 విూటర్ల వేగంతో రాకెట్ రోదసీలోకి దూసుకువెళుతుంది. 1.85 నిమిషాలకు 56.3 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్‌ను చేర్చి తొలిదశ మోటారు రాకెట్ నుంచి విడిపోయింది. వెంటనే 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో ఉన్న రెండో దశ మోటారు అంటుకొని సెకనుకు 2,389 మీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. 4.39 సెకన్లకు రాకెట్‌ను 129.9 కిలోవిూటర్ల ఎత్తుకు చేర్చి రెండో దశ మోటారు విడిపోయింది. తదుపరి 7.6 టన్నుల ఘన ఇంధనం కలిగిన మోటారు పనిచేస్తూ సెకనుకు 5,376 విూటర్ల వేగంతో దూసుకెళుతూ 10.14 నిమిషాలకు 184.3 కిలోవిూటర్ల ఎత్తుకు రాకెట్‌ను చేర్చి విడిపోయింది. వెంటనే 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో ఉన్న నాల్గవ దశ మోటారు పనిచేయడం ప్రారంభించింది. సెకనుకు 7,732 విూటర్ల వేగంతో రాకెట్ పయనించి 18.81 సెకండ్లకు 454.2 కిలోవిూటర్ల ఎత్తుకు రాకెట్‌ను చేర్చి ఉపగ్రహాన్ని రోదసీలో ముందుకు నెడుతూ రాకెట్ నుంచి విడిపోయింది. దీంతో ఉప గ్రహం ముందుకు పయనించి ప్రయోగానంతరం 19.43 నిమిషాలకు 506.3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొంటుంది. ఈ ఉపగ్రహం భూ మధ్యరేఖకు 19.2 డిగ్రీల వాలులో 284 కిలోమీటర్లకు దగ్గరగా 20,652 కిలోవిూటర్ల దూరంగా ఉండే దీర్ఘ వత్తాకారపు తాత్కలిక కక్ష్యలోకి చేరుకొంటుంది. అనంతరం హసన్ కేంద్రం నుంచి ఈ ఉప గ్రహాన్ని 5సార్లు నియంత్రించి భూ మధ్యరేఖకు 31 డిగ్రీల వాలులో 36వేల కిలోమీటర్లు దూరం ఉండే స్థిర వత్తాకారపు కక్ష్యలోకి చేర్చనున్నారు. ప్రయోగం విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు.
పీఎస్ఎల్వీ సీ-24 విజయవంతం





