Tuesday, 3 November 2026

రెపోరేటు .25శాతం పెంపు

వృద్ధి ఐదుశాతం ఉండొచ్చు
ఆర్‌బీఐ గవర్నర్‌
ముంబై, జనవరి 28 (జనంసాక్షి) :
రెపో రేట్‌ 0.25 శాతం పెంచుతూ రిజర్వ్‌బ్యాంకు మంగళవారం కీలకనిర్ణయం వెలువరించింది. కరెంట్‌ ఖాతాల్లో లోటు పూడ్చటం వాటి నిర్వహణ నిల్వల నిష్పత్తిపై మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకుంది. ఆర్‌బీఐ నిర్ణయంతో రెపోరేట్‌ 8 శాతానికి చేరుకుంది. దీని ఫలితం సామాన్యులపై పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఐదు శాతంగా ఉండవచ్చని అంచనా వేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.5 శాతానికి చేరవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈమేరకు త్రైమాసిక పరపతి సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ సి.రాజన్‌ వెల్లడించారు. కరెంట్‌ ఖాతా లోటు 2.5 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. గతేడాది ద్రవ్యోల్బణం 8 శాతానికి మించదని ఆర్‌బీఐ నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాదికూడా ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకే ఆర్‌బీఐ రేపోరేట్‌ పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే రెపో రేట్‌ పెంపు నిర్ణయం స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల బాటపట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *