Tuesday, 3 November 2026

సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల దౌర్జన్యం

బిల్లు పాస్‌గానీ.. పగలే చుక్కలు చూపెడుతాం : నరేందర్‌రావు
హైదరాబాద్‌, జనవరి28 (జనంసాక్షి) :
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కోరినట్లుగా విభజన బిల్లును వెనక్కి పంపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారం సచివాలయంలో ఇరుగేట్లకు తాళాలు వేసి ఆందోలనకు దిగారు. ఒకే భాష, ఒకే రాష్ట్రమంటూ నినాదాలు ఇచ్చారు. సీఎం ఇచ్చిన నోటీసు ప్రకారం తీర్మానాన్ని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. విభజన బిల్లును వెనక్కి పంపాలంటూ సెక్రటేరియట్‌ గేట్‌ దగ్గర ధర్నాకు దిగారు. ప్రతిగా తెలంగాణ ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలు చేశారు. వారిపైకి సీమాంధ్ర ఉద్యోగులు దాడికి దిగారు. సభలో బిల్లు పాసైతే గాని పట్టపగలే చుక్కలు చూపిస్తామంటూ హూంకరించారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఆందోళన విరమించుకోవాలని కోరారు. ఉద్యోగులు ఒప్పుకోకపోవడంతో అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *