
బుందేల్‌ఖండ్ – బెంగళూర్ రైలుమార్గం ఎందుకేయరూ?
నిలదీసిన రాహుల్
హమీర్‌పూర్, అక్టోబర్ 30 (జనంసాక్షి) :
రెండున్నర దశాబ్దాలు ఉత్తరప్రదేశ్ పాలకుల అలక్ష్యానికి గురైందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని ఏలుతున్న సమాజ్‌వాదీ పార్టీని బుందేల్‌ఖండ్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వీరి గొంతుక కేవలం లక్నోలో మాత్రమే విడబడుతోందని, వెనుకబడ్డ బుందేల్‌ఖండ్‌లో కాదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకోవడం ద్వారా బుందేల్‌ఖండ్‌లాంటి వెనుకబడ్డ ప్రాంతాలతో సహా యూపీ అభివృద్ధి చెందుతుందన్నారు. మోడీ మంత్రం యూపీలాంటి రాష్ట్రాల్లో పనిచేయదన్నారు. తాను ఈ దేశానికి చౌకీదారునని ప్రకటించుకున్న మోడీ వాచ్‌మన్లను ఈ దేశం ప్రధానమంత్రి చేయలేదన్నారు. అలాగే పేదల అర్ధాకలిని తెలుసుకున్న యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. బుందేల్‌ఖండ్ నుంచి బెంగళూర్‌కు రైలు మర్గాన్ని నిర్మించాలని, ఇది ఇక్కడ ప్రజల చిరకాలవాంఛన్నారు. తద్వారా భారతదేశానికి కాదు ప్రపంచానికే బుందేల్‌ఖండ్ అనుసంధానమవుతుందన్నారు.
25 ఏళ్లుగా యూపీ అలక్ష్యం




