Tuesday, 3 November 2026

27 శాతం మధ్యంతర భృతి

హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) :

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతరభృతి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పలు విడతలుగా చర్చించిన అనంతరం 27 శాతానికి అంగీకరిస్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో 5 గంటల పాటు సాగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 27శాతం మధ్యంతర భృతికి అంగీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు నగదు రహిత వైద్యానికి ఆరోగ్యకార్డులు జారీ చేస్తామని, వీటి వల్ల 14 లక్షల 70 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం తెలిపారు. మధ్యంతర భృతి 27 శాతం ప్రకటించామని, 27 శాతం ఐఆర్‌ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. 2014 జనవరి 1 నుంచి ఐఆర్‌ వర్తిస్తుందన్నారు. త్వరలో పీఆర్‌సీ కూడా పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నిట్లో ఉద్యోగులను భాగస్వాములను చేస్తున్నామని సీఎం అన్నారు. పాత బకాయిలతో జులై 1 నుంచి మధ్యంతర భృతి ఇవ్వమంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించలేదని సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. జులై 1 నుంచి పాతబకాయిలు చెల్లించాల్సి వస్తే 25 శాతం మాత్రమే ఇస్తామన్నారని తెలిపారు. జనవరి 1 నుంచి చెల్లించాల్సి వస్తే 27 శాతం మధ్యంతర భృతికి సీఎం అంగీకరించారని, దాన్ని ఆమోదించడం పట్ల కొన్ని సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయన్నారు.ఉద్యోగ సంఘం నేతలు 33 శాతం కోరగా ప్రభుత్వం మొదట్లో 22 శాతం ఇవ్వజూపింది. పలు దఫాలుగా చర్చించిన విూదట ప్రభుత్వం మధ్యేమార్గంగా 27 శాతం ఐఆర్‌ను ప్రకటించింది. పదో పీఆర్‌సీ ఆలస్యం కావడంతో ఉద్యోగులు మధ్యంతరభృతిని కోరారు. 2014 జనవరి 1 నుంచి పెంచిన ఐఆర్‌ అమల్లోకి రానుంది. దీంతో ఏడాదికి రూ. 7,681 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆరోగ్యకార్డులపై కూడా నిర్ణయం ప్రకటించనుంది. చర్చల సందర్భంగా  ప్రస్తుత రాష్ట్ర ఆర్థికపరిస్థితిని ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించారని, రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితుల కారణంగా తాము దీనికి ఒప్పుకొన్నామని సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఆర్‌ కోసం కృషిచేసిన ఆర్థికమంత్రికి ఉద్యోగసంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత వేతనాలపై 27 శాతం ఐఆర్‌ చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ. 7,683 కోట్లు అదనపు భారం పడుతుంది. మొత్తానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు సఫలమయ్యాయి. 27 శాతం మధ్యంతరభృతి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2014 జనవరి 1 నుంచి మధ్యంతర భృతి అమలులోకి రానుంది.చర్చల్లో మంత్రులు పితాని సత్యనారాయణ, ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ మహంతిలు పాల్గొన్నారు. పాత బకాయిలతో జులై 1 నుంచి మధ్యంతర భృతి ఇవ్వమంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించలేదని సచివాలయ ఉద్యోగులు నిరాశను వ్యక్తం చేశారు. జులై 1 నుంచి పాత బకాయిలు చెల్లించాల్సి వస్తే 25 శాతం మాత్రమే ఇస్తామన్నారని తెలిపారు. జనవరి 1 నుంచి చెల్లించాల్సి వస్తే 27 శాతం మధ్యంతర భృతికి సీఎం అంగీకరించారని, దాన్ని ఆమోదించడం పట్ల కొన్ని సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయన్నారు. ప్రస్తుత వేతనాలపై 27 శాతం ఐఆర్‌ చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ. 7,683 కోట్లు అదనపు భారం పడుతుంది. కాగా ఐఆర్‌పై ఉద్యోగ సంఘాలు భిన్నాభిప్రాయాలు వెల్లడించాయి. ఉద్యోగులపై ప్రేమతోనే ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. దీనికి తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఇంత ఎక్కువ ఐఆర్‌ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారని తెలిపారు. ఇదిలావుంటే ప్రభుత్వోద్యోగులకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్యంతర భృతిని ప్రకటించడంపై సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం 2014 జనవరి 1 నుంచి ఐఆర్‌ వర్తిస్తుందని ప్రకటించడం తమకు అసంతృప్తిని కలిగించిందని వారు అన్నారు. తాము జులై నుంచి ఐఆర్‌ కోరామని కానీ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. తాము తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *