
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) :
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పును జులై 28కి వాయిదా వేస్తూ నాంపల్లి సీబీ ఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెల్లడించే తేదీని జులై 28న ప్రకటిస్తామని 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గురు వారం తెలిపారు. ఇప్పటికే వాదనలు పూర్తయి తు ది తీర్పు వెల్లడించాల్సి ఉన్న నేపథ్యంలో అదే రోజు తీర్పు వెలువడవచ్చని
కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. కోట్లాది రూపాయల కుంభకోణంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3,038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదీన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడంతో ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రామలింగరాజు కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.
సత్యం తుది తీర్పు జులై 28కి వాయిదా




